Cyber Scam: మోసగాళ్ల వలలో చిక్కిన డాక్టర్.. ఒక్క క్లిక్‌తో సర్వం స్వాహా

Investment Fraud: దేశంలో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే కోరికతో.. పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న వారే టార్గెట్‌గా దుండగులు అక్రమాలకు పాల్పడుతున్నారు. నకిలీ స్కీమ్స్‌తో మోసగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారు. వాటిని మంచి రిటర్నులు ఇచ్చే పెట్టుబడి మార్గాలుగా వాటిని భావించిన జనం బుట్టలో పడుతున్నారు. నిజమైన పెట్టుబడిలాగా కనిపిస్తూనే బాధితులకు గణనీయమైన ఆర్థిక నష్టాలను తెచ్చిపెడుతున్నాయ.

తాజాగా తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడిని మోసగాళ్లు నట్టేట ముంచారు. యూట్యూబ్ ఛానల్‌లోని ఒక ప్రకటనను నమ్మి అక్కడి లింక్‌పై క్లిక్ చేయడంతో ఏకంగా 76.5 లక్షలు కోల్పోయారు. మోసగాళ్లతో నిండిన ఓ వాట్సప్‌ గ్రూప్‌కు ఆ లింక్ ద్వారా రీడైరెక్ట్ అయినట్లు డాక్టర్ తెలిపారు. అక్కడ పలువురు నకిలీ ఇన్వెస్టర్స్ లాభపూరిత వ్యూహాల గురించి చర్చిస్తూ తన విజయగాథలను షేర్ చేసినట్లు వెల్లడించారు.

Tamilnadu doctor cheated by scammers

దివాకర్ సింగ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఆ గ్రూప్ నడపబడతున్నట్లు డాక్టర్ తెలిపారు. తరచుగా వ్యాపార సూచనలు, పెట్టుబడి సలహాలు ఇస్తూ తనలో నమ్మకాన్ని పెంచారని చెప్పారు. దీంతో ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కోసం గ్రూప్‌లో సూచించిన ప్లాట్‌ఫారమ్‌లో ఖాతా తెరిచినట్లు వివరించారు. నమ్మకం కలగడంతో వారి సూచనలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టడం సైతం ప్రారంభించానన్నారు.

ఎక్కువ పెట్టుబడులు పెట్టిన కొద్దీ లాభాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని గ్రూప్ సభ్యులు హామీలు ఇచ్చినట్లు చెప్పారు. 30 శాతం లాభాలను వాగ్దానం చేయడంతో వారిని గుడ్డిగా నమ్మినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన డబ్బును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు అదనపు ఫీజు అడగడంతో మోసానికి గురయ్యారనే విషయం అర్థమైందంటూ లబోదిబోమన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ సలహాదారులను సంప్రదించడం మంచిదని, అనధీకృత లింక్‌లను ఎప్పటికీ క్లిక్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+