తమిళనాడు రాష్ట్ర సిఎస్ గా గిరిజ వైద్యనాథన్ నియమిస్తూ ప్రభుత్వ నిర్ణయం

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ ను రాష్ట్రప్రభుత్వం ఎంపిక చేసింది,.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్మోహన్ రావు ఇంటిపై ఆదాయపుపన్ను శాఖాధికారులు దా

చెన్నై: తమిళనాడు రాస్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పి రామ్మోహన్ రావు స్థానంలో గిరిజ వైథ్యనాథన్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆయన స్థానంలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజ వైద్యనాథన్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.1981 బ్యాచ్ కుచెందిన గిరిజ వైద్యనాథన్ సిఎస్ గా భాద్యతలను స్వీకరించనున్నారు.

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్మోహన్ రావు ఇంటిపై ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆయన ఇంట్లో భారీగా నగలు, నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఆయన తనయుడు ఇంట్లో కూడ భారీగా నగదు, నగలను స్వాధీనం చేసుకొన్నారు. మాజీ టిటిడి సభ్యుడు శేఖర్ రెడ్డి వ్యవహరంతో సిఎస్ విషయం వెలుగు చూసింది.

దీంతో రెండు రోజులుగా సిఎస్ ఇంటిపై ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలో సిఎస్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించడం ఇదే ప్రథమం.

tamilnadu governament choose new chief secretary girija vydyanathan

రామ్మోహన్ తో పాటు ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన 13 ఇళ్ళపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కారణమైంది. ఈ కారణంగానే ఆయనను ఆ పదవి నుండి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నేపథ్యంలోనే రామ్మోహన్ రావును తప్పించి, ఆయన స్థానంలో గిరిజ వైద్యనాథన్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

అయితే సీనియర్ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి పేరును కూడ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పదవి కోసం పరిశీలించినట్టు సమాచారం. అయితే చంద్రమౌళి కంటే గిరిజ వైద్యనాథన్ వైపే సిఎం పన్నీర్ సెల్వం మొగ్గు చూపారు.దరిమిలా గిరిజ వైద్యనాథన్ కే సిఎస్ గా ఆమోద ముద్ర లభించింది.1981 బ్యాచ్ కు చెందిన గిరిజ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలను స్వీకరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+