మీరేమీ రాజులు కాదు, ప్రభుత్వాన్ని కూల్చేస్తా: కమల్
తమిళనాడులో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి ఆయన సహచర మంత్రి వర్గం నుంచి పెద్ద తలనొప్పి ఎదురైయ్యింది. సినిమాలు చేసుకోకుండా మా ప్రభత్వం, రాజకీయాల గురించి మాట్లాడటానికి మీరెవరు ? అంటూ బహుబా
చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి ఆయన సహచర మంత్రి వర్గం నుంచి పెద్ద తలనొప్పి ఎదురైయ్యింది. సినిమాలు చేసుకోకుండా మా ప్రభత్వం, రాజకీయాల గురించి మాట్లాడటానికి మీరెవరు ? అంటూ బహుబాష నటుడు కమల్ హాసన్ మీద కొందరు మంత్రులు విమర్శలు చేశారు.
కమల్ హాసన్ సైతం ఒక్క మొట్టు తగ్గకుండా తమిళనాడులో అధికారంలో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రజలకు సేవ చెయ్యడానికి మీకు పదవులు ఇచ్చారని, మీరు మాత్రం ఎంజాయ్ చేస్తూ ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని కమల్ హాసన్ ను విమర్శించారు.

మూర్ఖుడని అడ్డుకునేవాడే నేత !
అన్నాడీఎంకే ప్రభుత్వం మీద కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ సారి ప్రత్యక్షంగా ఆరోపణలు చెయ్యకుండా అభిమానులకు పిలుపినిస్తున్నట్లు ఉన్న ఓ కవిత రూపంలో విమర్శించారు. మూర్ఖుడిని అడ్డుకునే వాడే నేత, కొంత కాలం ఓపికగా ఉండండి అంటూ కవిత ద్వారా తన అభిమానులను ఉత్తేజితులను చేస్తూ సందేశం ఇచ్చారు.
Recommended Video


మీరేమైనా రాజులా ?
తమిళనాడులో శాశ్వతంగా అధికారంలో ఉండిపోవడానికి మీరేమి రాజులు కాదు అంటూ అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించిన కమల్ హాసన్ నేను కాని తలుచుకుంటే మీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని తీవ్రస్థాయిలో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అవినీతి మంత్రులు మాట్లాడితే ?
అన్నాడీఎంకే ప్రభుత్వం మొత్తం అవినీతిమయం అయ్యిందని కమల్ హాసన్ ఆరోపించారు. ఎక్కువ మాట్లాడితే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని మంత్రులు కమల్ హాసన్ ను హెచ్చరించారు. ప్రస్తుతం తమిళనాడు మంత్రులు, కమల్ హాసన్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

తెరమీదకు టీటీవీ దినకరన్
ఈ సందర్బంలో ఎడప్పాడి పళనిసామి వర్గం పార్టీ నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ తెరమీదకు వచ్చారు. మంత్రులు చీఫ్ గా మాట్లాడకూడదని హితవుపలికారు. కమల్ హాసన్ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడే సమయంలో ఆలోచించి మాట్లాడాలని సూచించారు.

ఎంజీఆర్, జయలలిత ఎలా ఉన్నారంటే !
ఎవరితో ఎలా మాట్లాడాలి ? అనే విషయంలో అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్, దివంగత ముఖ్యమంత్రి జయలలితను చూసి నేర్చుకోవాలని మంత్రులకు టీటీవీ దినకరన్ ఉచితసలహా ఇచ్చారు. అయితే దినకరన్ వ్యాఖ్యలు వింటున్న మంత్రులు నవ్వుకుంటున్నారు.












Click it and Unblock the Notifications