63 శాతం పెరిగిన టమాట ధర.. వర్షం, సరఫరా కూడా సమస్యే
టమాటా, ఉల్లి ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో దిగుబడి పెరిగి ధరలు తగ్గుతాయని తెలిపింది. నవంబర్ 25 నాటికి దేశంలో కిలో టమాట సగటు ధర రూ.67 ఉంటుందని, గత ఏడాదితో పోల్చితే 63 శాతం టమాట ధర పెరిగిందని తెలిపింది. అకాల వర్షాల కారణంగా పంటనష్టం, సరఫరాపై ప్రభావంతో టమాట ధరలు పెరిగాయని తెలిపింది.
ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 70.12లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిదని, గతేడాదితో పోల్చితే టమాట దిగుబడి తగ్గింది వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్లలోకి ఖరీఫ్ సీజన్ ఉల్లిపాయలు చేరుకుంటున్నాయని,సెప్టెంబర్‌లో పంజాబ్, యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడం వల్ల దిగుబడి ఆలస్యమైందని తెలిపింది.

తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోనూ కురిసిన భారీ వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడంతో పాటు రవాణాపై కూడా ప్రభావం పడిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా నవంబర్ 25 నాటికి సగటు ఉల్లిపాయ ధర రూ.39 ఉంటుందని, గతేడాదితో పోల్చితే 32 శాతం ఉల్లిపాయ ధర తగ్గిందని తెలిపింది. 2019, 2020 కంటే ఉల్లిపాయ ధర ప్రస్తుత తక్కువేనని పేర్కొంది. ఉల్లిపాయ ధర నియంత్రించేందుకు బఫర్ నిల్వల నుంచి విడుదల చేశామని వెల్లడించింది. కేంద్రం వద్ద ఉన్న 2.08 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వల నుంచి ఉల్లిని విడుదల చేసినట్లు కేంద్రంపేర్కొంది.
Recommended Video
బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయని నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకున్నాయని చెప్పింది. ధరల నియంత్రణ పథకం కింద రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో, ఈశాన్య రాష్ట్రాలకు 75:25 నిష్పత్తిలో వడ్డీ రహిత అడ్వాన్సులను కేంద్రంఅందించింది. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు రూ.164.15 కోట్ల కేంద్ర వాటా విడుదల చేసినట్లు పేర్కొంది. ఆహార వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్రాలు నిధులు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు రాష్ట్రాలు సైతం ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది.
-
LPG కావాల్సినంత ఉంది. మీ ఇంటికి గ్యాస్ గ్యారెంటీ! -
మొబైల్ డేటాపై కేంద్రం పన్ను? GB పై ఎంత ట్యాక్స్? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన!












Click it and Unblock the Notifications