శవాలతో పూజలు, నగ్న పూజలు కూడా..: దిమ్మతిరిగే లీలలు
శవాలతో పూజలు చేస్తూ పట్టుబడిన తాంత్రిక్ బాబా లీలలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. నగ్నపూజలు, ఇతర పూజలంటా కోట్లాది రూపాయలు కూడబెట్టినట్లు బయటపడింది.
చెన్నై: శవంతో పూజలు చేస్తూ పట్టుబడిన తాంత్రిక్ బాబా లీలలు మరిన్ని బయటపడ్డాయి. ఆరో తరగతి వరకే చదివినప్పటికీ పెద్ద పెద్ద వాళ్లను అతను బురిడీ కొట్టించి, తన ముందు మోకరిల్లేలా చేసుకున్నాడు. దోషనివారణ పూజలు, నగ్నపూజలు, శవపూజలు, కాళికాదేవి పూజలంటూ కోట్లాది రూపాయలు వెనకేసుకున్నట్లు బయటపడింది.
ఇటీవల తమిళనాడు పెరంబలూరులో చెన్నై యువతి అభిరామి శవంతో పూజలు చేస్తూ పోలీసులకు కార్తికేయన్ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అతని గురించి అవాక్కయ్యే విషయాలు వెలుగు చూశాయి. అతని గది నుంచి ఇప్పటికే పదుల సంఖ్యలో పోలీసులు పుర్రెలను స్వాధీనం చేసుకున్నారు.

వీర్యశక్తిని పెంచే సముద్రపు గుర్రాలు, లగ్జరీ కారు, లక్షలాది రూపాయల విలువజేసే వినాయకుడు, కాళికాదేవి విగ్రహాలను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. సంతానం కోసం వచ్చే దంపతులకు సముద్రపు గుర్రాలను వేలాది రూపాయలకు విక్రయించేవాడని విచారణలో బయటపడింది. పలువురు రాజకీయ ప్రముఖులు తమ జాతకాలిచ్చి మరీ ఇతడి వద్ద ప్రత్యేక దోష నివారణ పూజలు జరుపుకున్నారని తెలుస్తోంది.
అభిరామి శవాన్ని శ్మశానం నుండి తవ్వితీసిన వినోద్‌కుమార్, సతీష్, ధనరాజ్, కార్తిక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహానికి పెరంబలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రీ-పోస్టుమార్టం జరిపారు. మాంత్రికుడు కార్తికేయన్‌ను రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications