ఆ యువతిని వివస్త్రని చేయలేదు: కన్నడ హోంమంత్రి
బెంగళూరు: టాంజానియా యువతిని రోడ్డు పైన వివస్త్రను చేసిన ఘటన పైన కర్నాటక హోమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ గురువారం నాడు స్పందించారు. ఆ మహిళను వివస్త్రను చేసి ఊరేగించారనడం అవాస్తవమని చెప్పారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు చెప్పారు.
అయితే, వివస్త్రను చేసి ఊరేగించారని చెప్పడం మాత్రం అవాస్తవమని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు అయిదుగురిని అరెస్టు చేశామన్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా తెలియజేశామన్నారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఘటనను సీరియస్‌గా తీసుకొని, పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసును సిసిబికి (సిటీ క్రైమ్ బ్రాంచ్) అప్పగించినట్లు చెప్పారు. అరెస్టైన వారిలో లోకేష్ భంగరి, వెంకటేష్ రామయ్య, సలీమ్ పాషా, భాను ప్రకాశ్, రెహ్మతుల్లాలు ఉన్నట్లు చెప్పారు.
కాగా, బెంగళూరులో మొత్తం పన్నెండు వేల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారని, వారిని రక్షించే బాధ్యత తమదేనని ఆయన చెప్పారు. విదేశీ విద్యార్థులకు ఎప్పుడూ రక్షణ ఉంటుందన్నారు. వారికి భద్రత కల్పించడం తమ బాధ్యత అన్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications