టాంజానియా యువతి, వివస్త్ర: 'నల్లగా ఉన్నందువల్లే'
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో టాంజానియా యువతి పైన జరిగిన ఘోరం సంచలం రేపుతోంది. భారత్‌లో టాంజానియా హై కమిషనర్ జాన్ కిజాజి మాట్లాడుతూ.. బాధితురాలు నల్లగా ఉండటం వల్లనే ఈ దారుణం జరిగిందని, ఇది జాత్యాంహకార దాడి అని ఆరోపించారు.
బెంగళూరులో గత ఆదివారం టాంజానియా విద్యార్థినిపై జరిగిన దాడి పెద్ద వివాదంగానే మారేలా కనిపిస్తోంది. ఎవరో కారుతో ఢీకొట్టి వ్యక్తి మరణానికి కారణమైతే... స్నేహితులతో కలిసి అటుగా వెళుతున్న టాంజానియా విద్యార్థినిపై బెంగళూరువాసులు దారుణానికి తెగబడ్డారు.

ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేసి నగ్నంగా పరుగులు పెట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై టాంజానియా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బెంగళూరువాసుల దారుణ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని భారత్‌కు చెప్పింది.
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో పాటు టాంజానియా, మరిన్ని దేశాల దౌత్యాధికారుల బృందం నేడు బెంగళూరుకు వెళ్లనుంది. ఘటనపై సమగ్ర వివరాలు సేకరించడంతో పాటు నిందితులపై తీసుకోవాల్సిన చర్యలపైనా వారు బెంగళూరు పోలీసులతో చర్చించనుంది.

దాడి జరుగుతుంటే పోలీసులు పారిపోయారు
తనపై జరిగిన దాడి పై బాధితురాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు చూస్తుండిపోయారని ఆరోపించినట్లుగా తెలుస్తోంది. వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని కూడా చెప్పింది.
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్










Click it and Unblock the Notifications