Target: హోమ్ మంత్రిని రేప్ పేరుతో విమర్శించిన కేపీసీసీ చీఫ్, హోమ్ మంత్రి అజ్ఞాని అంటూ ఫైర్ !
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. కర్ణాటకో కరోనా వైరస్ (కోవిడ్ -19) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, తప్పుడు కరోనా పాజిటివ్ లెక్కలు (సంఖ్యలు) చూపించి అనవసరంగా ప్రజలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించి డబ్బులు వసూలు చేస్తోందని కేపీసీసీ చీఫ్ మాజీ మంత్రి డీకే. శివకుమార్ ఆరోపిస్తున్నారు. మేకదాటు ప్రాజెక్టుకు సంబంధించి మేము నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవడానికి బీజేపీ కోవిడ్ పాజిటివ్ కేసుల నాటకాలు ఆడుతోందని డీకే. శివకుమార్ ఆరోపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తున్నారు. ఇదే సమయంలో డీకే. శివకుమార్ తో పాటు కాంగ్రెస్ నాయకులకు కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర వార్నింగ్ ఇచ్చారు. హోమ్ మంత్రి వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కర్ణాటక హోమ్ మంత్రి మీద డీకే శివకుమార్ విరుచుకుపడ్డారు. హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర కాదు అజ్ఞాని జ్ఞానేంద్ర అంటూ డీకే శివకుమార్ మండిపడ్డారు. ఇదే సమయంలో హోమ్ మంత్రిని విమర్శించిన డీకే శివకుమార్ బహిరంగ సభలో పదేపదే రేప్ మంత్రి అనే పదం ఉపయోగించడం కలకలం రేపింది.

అధికార, ప్రతిపక్షాల కోవిడ్ కేసుల వార్
కర్ణాటకో కరోనా వైరస్ (కోవిడ్ -19) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, తప్పుడు కరోనా పాజిటివ్ లెక్కలు (సంఖ్యలు) చూపించి అనవసరంగా ప్రజలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించి డబ్బులు వసూలు చేస్తోందని కేపీసీసీ చీఫ్, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ఆరోపిస్తున్నారు.

మేకదాటు ప్రాజెక్టు రాజకీయం
మేకదాటు ప్రాజెక్టుకు సంబంధించి మేము నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవడానికి బీజేపీ కోవిడ్ పాజిటివ్ కేసుల నాటకాలు ఆడుతోందని డీకే. శివకుమార్ ఆరోపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు గత రెండు రోజుల నుంచి మేకదాటు పాదయాత్ర చేస్తున్నారు.

కరోనా పాజిటివ్ తప్పుడు కేసుల విచారణకు పట్టుపడుతున్న ప్రతిపక్షం
కర్ణాటకలోని బీజేపీ బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, తప్పుడు కరోనా పాజిటివ్ లెక్కలు చూపించి అనవసరంగా ప్రజలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించి డబ్బులు వసూలు చేస్తోందని, ఈ వివషయంలో న్యాయవిచారణ జరిపించి వాస్తవాలు బయటకు వచ్చేలా చూడాలని కేపీసీసీ చీఫ్, మాజీ మంత్రి డీకే. శివకుమార్ డిమాండ్ చేస్తున్నారు.

కేసులు పెడుతామని వార్నింగ్ ఇచ్చిన హోమ్ మంత్రి
మేకదాటు ప్రాజెక్టు విషయం అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తున్నారని, వివిద జిల్లాల నుంచి పాదయాత్రలో పాల్గొనడానికి ఆ పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో వస్తున్నారని, కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోయే అవకాశం ఉంది, పోలీసులు అనుమతి ఇవ్వపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యంగా పాదయాత్ర చేస్తున్నారని, పాదయాత్రకు బ్రేక్ వెయ్యకుండా చట్టపరంగా చర్యలు తీసుకుని అందరి మీద కేసులు నమోదు చేస్తామని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర వార్నింగ్ ఇచ్చారు.

అజ్ఞాని జ్ఞానేంద్ర అంటూ విమర్శలు
కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీద డీకే శివకుమార్ విరుచుకుపడ్డారు. కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర కాదు అజ్ఞాని జ్ఞానేంద్ర, ఆ అజ్ఞాని జ్ఞానేంద్ర మాటలు మేము పట్టించుకోవాలా అంటూ మాజీ మంత్రి డీకే. శివకుమార్ వ్యంగంగా అన్నారు.

హోమ్ మంత్రి మీద రేప్ వ్యాఖ్యల కలకలం
ఇదే సమయంలో కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్రను విమర్శించిన కర్ణాటక మాజీ మంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బహిరంగ సభలో పదేపదే రేప్ మంత్రి అనే పదం ఉపయోగించడం కలకలం రేపింది. గత ఏడాదిలో మైసూరులో కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగిన సమయంలో హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు.
Recommended Video

కాంగ్రెస్ నన్ను రేప్ చేస్తోందని మాట్లాడిన హోమ్ మంత్రి
మైసూరులో కొందరు కాలేజ్ అమ్మాయి మీద రేప్ చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తన మీద రేప్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర తీరును కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండగడుతున్నారు. ఇప్పుడు కేపీసీసీ చీఫ్ డీకే. శివకుమార్ ఏకంగా హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్రను విమర్శిస్తూ రేప్ అనే పదం ఉపయోగించడం హాట్ టాపిక్ అయ్యింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications