తరుణ్ తేజ్‌పాల్ సెల్‌లో మొబైల్ ఫోన్, సౌకర్యాల తగ్గింపు

గురువారం సబ్ జైలు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యులను కలిసే విషయంలో, క్యాంటీన్, టెలిఫోన్ ఉపయోగించే విషయంలో సౌకర్యాలు తగ్గించినట్లు అందులో పేర్కొన్నారు. తరుణ్ సెల్‌లో దొరికిన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
తరుణ్ బెయిల్ పిటిషన్ పైన బాంబే హైకోర్టు మార్చి నాలుగున విచారణ జరపనుంది. తరుణ్ తేజ్‌పాల్‌ను అతని న్యాయవాది కలుసుకోవచ్చునని జైలు అధికారులు చెప్పారు.
కాగా, మహిళా ఉద్యోగినిపై అత్యాచారం చేశాడని తెహెల్కా మాజీ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌పై గోవా పోలీసులు అభియోగం మోపిన విషయం తెలిసిందే. సోమవారం ఈ మేరకు వారు చార్జిషీట్ దాఖలు చేశారు. ఆయనపై నిరుడు నవంబర్ 22వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. గోవాలోని హోటల్ లిఫ్ట్‌లో మహిళా ఉద్యోగిపై తరుణ్ తేజ్‌పాల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2013 నవంబర్‌లో తెహెల్కా థింక్ ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
తేజ్‌పాల్‌పై దాఖలు చేసిన చార్జిషీట్ 2,846 పేజీలు ఉంది. అందులో 132 పేజీలు ప్రధాన చార్జిషీట్ కాగా, 30 పేజీలు సాక్షులకు సంబంధించినవి. అనుబంధాలతో కలిపి మొత్తం 2,846 పేజీల చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. పోలీసులు 152 మంది సాక్షు వాంగ్మూలాలను నమోదు చేశారు.
వారిలో దర్యాప్తు అధికారి సునీత సావంత్ వాంగ్మూలం కూడా ఉంది. బాధితురాలు అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైందని, హోటల్‌లోని లిఫ్ట్‌లో ఆమె గౌరవానికి భంగం వాటిల్లిందని నిరూపించడానికి తమ వద్ద తగిన ఆధారాలున్నాయని పోలీసులు చార్జిషీట్‌లో తెలిపారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications