హెచ్ -1 బీ వీసా ధరఖాస్తులను తగ్గించేసిన టిసిఎస్, కారణమిదే
దేశీయ సాఫ్ట్ వర్ దిగ్గజం టీసీఎస్ హెచ్ -1 బీ వీసా ధరఖాస్తులను గణనీయంగా తగ్గించేసింది. 2015 ధరఖాస్తు చేసుకొన్న వాటిల్లో మూడోవంతు మాత్రమే ఈ సారి ధరఖాస్తు చేసుకొంది.
న్యూఢిల్లీ: దేశీయ సాఫ్ట్ వర్ దిగ్గజం టీసీఎస్ హెచ్ -1 బీ వీసా ధరఖాస్తులను గణనీయంగా తగ్గించేసింది. 2015 ధరఖాస్తు చేసుకొన్న వాటిల్లో మూడోవంతు మాత్రమే ఈ సారి ధరఖాస్తు చేసుకొంది.
టీసీఎస్, ఇన్పోసిస్ , కాగ్నిజెంట్ లు హెచ్ -1 బీ వీసాలు తమ సంస్థల్లోకి మళ్ళించుకొంటున్నాయన్న ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకొంది.

అమెరికాలోని టాప్ బి-స్కూల్స్ నుండి వందల సంఖ్యలో ఇంజనీరింగ్, ఏంబీఏ గ్రాడ్యుయేట్లను నియమించుకొంటున్నట్టు చెప్పారు. ఇవన్నీ వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయన్నారు.
గత ఏడాది ,ప్రస్తుత ఏడాది మా వీసా ధరఖాస్తుల సంఖ్య బాగా తగ్గిందన్నారు.ఒక్క అమెరికాలో కాకుండా అస్ట్రేలియా, సింగపూర్ లో కూడ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పలు సంస్థలు తమ వ్యాపార విధానాలను మార్చుకొంటున్నాయి. వచ్చే రెండేళ్ళలో పదివేల అమెరికన్లను నియమించుకొంటామని ఇప్పటికే ఇన్పోసిస్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications