టాటా మోటార్స్: ‘ది #ఫెంటాస్టిక్ హంట్’

టాటా మోటార్స్ త్వరలో విడుదల చేయనున్న కారు కోసం నాలుగు నగరాల్లోని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇందు కోసం ఆన్‌లైన్ భారీ స్థాయిలో హంట్ జరుగుతోంది.

కీ హైలెట్స్

- నాలుగు నగరాల్లో(ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా) ఆన్‌లైన్‌‌లో జాతీయస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ‘ది #ఫెంటాస్టికో హాంట్' థీంతో ఈ కారు ప్రచారం సాగుతోంది. కారు గురించి తెలుసుకునేందుకు ఈ ఫెంటాస్టికో హంట్ జరుగుతోంది.

Tata Motors: ‘The #Fantastico Hunt’

- ఈ నాలుగు నగరాల్లోని ప్రముఖ స్థలాల్లో కొత్త వాహనానికి సంబంధించిన నాలుగు అక్షరాలు దాచేయడం జరిగింది. వీటిని అభిమానులు గుర్తించాల్సి ఉంటుంది.

- ఈ నేపథ్యంలో అభిమానులు ఆ అక్షరాలను గుర్తించి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ద్వారా సందేశాలు, వ్యాఖ్యానాలు పంపుతున్నారు. సోషల్ మీడియాల్లో ఇచ్చిన క్లూస్ ద్వారా అభిమానులు అక్షరాలను కనుగొంటున్నారు.

- ఈ మొత్తం ప్రచారం కూడా ‘ది #ఫెంటాస్టికో హాంట్' పేరు మీదుగా సాగుతోంది. కాగా, ఇవి గుర్తించిన తర్వాత ఇది ఇట్స్ ఫెంటాస్టికో!

- ఫెంటాస్టికోలో పదాలను గుర్తించిన విజేతలకు బ్రాండెడ్ వస్తువులు అందజేయడం జరుగుతుంది.

Tata Motors: ‘The #Fantastico Hunt’

టాటా మోటార్స్ నుంచి కొత్త విడుదలవుతున్న కారు ‘జికా' ప్రచారం కోసం టాటా మోటార్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో ఈ ప్రచారం సాగుతోంది. ఇచ్చిన క్లూస్ ఆధారంగా అభిమానులు కొత్త కారు పదాలను కనుగొనే పనిలో ఉన్నారు. మరికొందరు కనుగొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

విజ్‌క్రాఫ్ట్, డిజిటాస్ లిబిలు సంయుక్తంగా ఈ(ది ఫెంటాస్టికో హంట్) ప్రచారాన్ని చేపడుతున్నాయి.
నగరంలోని అభిమానులు క్లూస్ ఆధారంగా దాచి ఉంచిన అక్షరాలను కనుగొంటున్నారు. వాలంటీర్లు, మద్దతుదారులు ఇందుకు సహాయకంగా నిలుస్తున్నారు.

ముంబైలోని ఫస్ట్ స్టార్‌బక్స్, ఢిల్లీలోని హౌజ్ ఖాస్ విలేజ్ లాంటి ప్రాంతాల్లో కొత్త కారుకు సంబంధించిన అక్షరాలను దాచడం జరిగింది. ఇచ్చిన క్లూస్ ఆధారంగా అభిమానులు వీటిని గుర్తించి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాగా, అన్ని అక్షరాలను కలిపితే కొత్త కారు పేరు వస్తుంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా కారుకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులు తెలుసుకుంటున్నారు. ‘#మేడ్ఆఫ్‌గ్రేట్' అనే శీర్షికతో పోస్టు చేస్తున్నారు. అక్షరాలను గుర్తించిన వారు ప్రముఖ బ్రాండ్ కంపెనీల వస్తువులను గెలుచుకుంటున్నారు.

Tata Motors: ‘The #Fantastico Hunt’

‘జికా'(డెరైవుడ్ ఫ్రం జిప్పీ కారు) ఇదే దేశం మొత్తం వేచిచూస్తున్న టాటా మోటార్స్ కొత్త కారు పేరు. టాటా మోటార్స్, లియోనల్ మెస్సీల భాగస్వామ్యంతో మేడ్ ఆఫ్ గ్రేట్‌ తొలిసారి ఈ కారును విడుదల చేశారు. లియోనల్ మెస్సీ టాటా మోటర్స్‌కు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్రచార ఫలితాలు

#ఫెంటాస్టికోకు 150 మిలియన్ ఇంప్రెషన్స్
45,469మెన్షన్స్

మేడ్ఆఫ్ గ్రేట్ ట్విట్టర్ నిర్వహణ

117 మిలియన్ ఇంప్రెషన్స్
14,979 మెన్షన్స్
ఎంగేజ్‌మెంట్ రేట్-1.7శాతం
రీట్వీట్ రీసివుడ్-986

Tata Motors: ‘The #Fantastico Hunt’

కోట్స్:

‘మేము బ్రాండ్ పరివర్తన చేస్తున్నాం. మెస్సీ, మా తొలి అసోసియేషన్ కంపెయిన్ #మేడ్ఆఫ్ గ్రేట్ లతో ప్రయాణం ప్రారంభించాం. మా కస్టమర్లకు కొత్త కారు ఆవిష్కరణలో ఆత్రుత కలిగించే ప్రయత్నం చేశాం. ఇప్పుడు మా కొత్త కారు జికాను విడుదల చేయనున్నాం. ప్రచారం పూర్తయిన తర్వాత అతి త్వరలో జికాను విడుదల చేస్తాం. ఫెంటాస్టికోతో చాలా ప్రచారం లభించింది. విజ్ క్రాఫ్ట్, డిజిటాస్ లిబి ఇండియాలు ప్రచారాన్ని గొప్పగా నిర్వహించాయి. బోర్డులో వారున్నందుకు సంతోషంగా ఉంది. దీంతో అనేక ప్రచారాలను అధిగమిస్తాం. మార్కెట్‌లో మేము కీలక పాత్ర పోషించనున్నాం' అని మార్కెటింగ్ అండ్ సర్వీసెస్ పాసెంజర్ వెహికిల్స్ టాటా మోటార్స్ హెడ్ డెల్నా అవారి తెలిపారు.

‘ఇలా ప్రచారం నిర్వహించడమనేది ఎంతో కొత్త ఆలోచన. మేడ్ ఆఫ్ గ్రేట్ భాగస్వామ్యంతో తొలిసారి నిర్వహించాం. 24గంటల్లోనే #ది ఫెంటాస్టికో హంట్‌కు ప్రచారం బాగా జరిగింది. ఇది జాతీయ స్థాయిలోనేగాక, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రచారం కల్పించింది. ఇందుకు టీం వర్క్ చాలా ఉంది' అని విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ మెహతా పేర్కొన్నారు.

‘సాధారణంగా కారు పేరును ఆవిష్కరించడం కన్నా.. ఇలా ప్రచారం చేయడం వల్ల అనేకమందికి మా కొత్త కారు గురించిన అవగాహన వచ్చింది. ఇట్స్ ఫెంటాస్టికో ద్వారా అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి మంచి స్పందన వచ్చింది' అని డిజిటాస్ లిబి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమరేశ్ గోడ్‌బోలే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+