Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tata Tubotronn 2.0- కమర్షిల్ ట్రక్స్ శ్రేణిలో టాప్ ఇంజిన్‌గా గుర్తింపు..!

దేశీయ కమర్షియల్ వాహన శ్రేణిలో అతిపెద్ద సంస్థగా టాటా మోటార్స్‌‌కు గుర్తింపుంది. ఈ మధ్యనే టాటా మోటార్స్‌ నుంచి ట్రక్ ఇంజిన్స్ సెగ్మెంట్‌లో టర్బోట్రాన్ 2.0 పేరుతో కొత్త ఇంజిన్‌‌ విడుదలైంది. ట్రక్ వేరియంట్‌లో ఈ ఇంజిన్ కొత్త మైలురాయిని సృష్టిస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది.

చిన్న ట్రక్కుల నుంచి భారీ వాహనాల్లో ఈ ఇంజిన్లను అమర్చి పరీక్షించడం జరిగింది. ఈ ఇంజిన్ సక్సెస్ అయినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. శక్తివంతమైన టర్బోట్రాన్ ఇంజిన్‌లు ఫ్లీట్ ఆపరేటర్లకు భరోసాను కల్పిస్తున్నాయి.శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు సమర్థవంతమైన ఇంధనం స్వభావం కలిగి ఉండటమే ఇందుకు కారణం.ఇంధనం ఆదాతో పాటు భరోసాను కూడా ఇవ్వడంతో కొత్త టర్బోట్రాన్ 2.0 మంచి గుర్తింపు పొందింది.

Tata s Turbotronn 2 0 Engine Proves Its Mettle on Indias Toughest Highways -Redefines Endurance and Efficiency Standards

టర్బోట్రాన్ 2.0 ఇంజిన్‌తో విశ్వాసాన్ని వ్యక్తం చేసిన టాటా మోటార్స్, 5.0 లీటర్ టర్బో డీజిల్ టర్బోట్రాన్ 2.0 ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 రికార్డులను సృష్టించిందని వెల్లడించింది. టర్బోట్రాన్ 2.0 ఎండ్యూరెన్స్ రన్‌ను తీసుకున్న సమయంలో ఈ అద్భుతం సాధించిందని టాటా మోటార్స్ వెల్లడించింది.

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు చెందిన ప్రతినిధుల పర్యవేక్షణలో టర్బోట్రాన్ 2.0 ఇంజిన్ కలిగిన రెండు ట్రక్కులు ముంబై-చెన్నై-కోల్‌కతా-ముంబై హైవేపై ఒక నెల పాటు పరుగులు తీశాయి. ఈ సమయంలో వాటి యొక్క ఆపరేటింగ్ కండీషన్స్‌ను పరిశీలించింది ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల బృందం.

రెగ్యులర్ ట్రక్కులు సాధారణంగా రోజుకు 500-600 కిలో మీటర్లు ప్రయాణిస్తాయి. అంటే నెలకు 15వేల నుంచి 18 వేల కిలో మీటర్లు కవర్ చేస్తాయి.అయితే టర్బోట్రాన్ 2.0 ఇంజిన్‌తో పరుగులు తీసిన టాటా ట్రక్కులు రోజుకు 1000 కిలోమీటర్లను సునాయాసంగా కవర్ చేస్తూ నెలకు 30,000 కిలోమీటర్ల మార్కును టచ్ చేశాయి.

గోల్డెన్ క్వాడ్రిలాటరల్‌గా పిలుచుకునే ముంబై-చెన్నై-కోల్‌కతా-ముంబై రహదారి చాలా కీలకమైనది. దేశ రాజధాని ఢిల్లీతో దేశంలోని ఇతర మెట్రో నగరాలను అనుసంధానం చేసేదే ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ హైవే. ఈ మొత్తం రహదారి లేదా స్ట్రెచ్ 5846 కిలోమీటర్లు ఉంటుంది.

సరికొత్త టర్బోట్రాన్ 2.0 ఇంజిన్‌తో టాటా మోటార్స్ 9 జాతీయ మరియు 9 ఇండియన్ రికార్డులను సృష్టించింది.ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ,డ్యూరబిలిటీ, రిలయబిలిటీల్లో ఈ రికార్డులు నెలకొల్పాయి. వీటితో పాటు ఇంకొన్ని రికార్డులను సైతం సొంతం చేసుకుంది టాటా మోటార్స్.

టర్బోట్రాన్ 2.0 అనేది 5.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్, ఇది 180-204 PS మరియు గరిష్ట టార్క్ అవుట్‌పుట్ 750-850Nm వరకు వివిధ రకాల పవర్ నోడ్‌లలో లభిస్తుంది.టర్బోట్రాన్ 2.0 కఠినమైన BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రూపొందించబడింది, ఇది ఫ్లీట్ ఆపరేటర్లకు పర్యావరణ అనుకూలమైన ఎంపికగా మారింది.

టర్బోట్రాన్ 2.0 సౌకర్యవంతమైన డ్రైవ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ లోడ్‌ ఉన్నప్పటికీ కూడా ట్రక్కు పెర్ఫార్మెన్స్ ఏమాత్రం తగ్గదు.ఇక ఇంజిన్ సర్వీసు, ఆయిల్ మార్చేందుకు నిడివి లక్ష కిలోమీటర్లు ఉన్నందున ఫ్లీట్ ఆపరేటర్లు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇక దీని నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువే అని చెప్పాలి.దీంతో వ్యాపారం ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతుంది.

టర్బోట్రాన్ 2.0 ఇంజిన్‌ అత్యుత్తమైన వారంటీ కవరేజీతో వస్తోంది. టాటా మోటార్స్ 6 సంవత్సరాలు / 6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ అందిస్తోంది. ఇంజిన్ మన్నిక, ప్రదర్శనపై కంపెనీ చాలా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. సాంకేతికపరంగా కూడా ఈ ఇంజిన్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉందని పేర్కొంది.

మొత్తానికి టాటా మోటార్స్ నుంచి వచ్చిన టర్బోట్రాన్ 2.0 ఇంజిన్ భారతీయ ట్రక్కుల పరిశ్రమలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది.ఇంధన సమర్థత, మన్నిక, పెర్ఫార్మెన్స్‌తో కమర్షియల్ వాహనాల శ్రేణిలో సరికొత్త ఒరవడిని సృష్టించనుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అధిక ఇంధన సమర్థతతో కేవలం లాభదాయకమైన ఇంజిన్‌గానే కాకుండా మెరుగైన మైలేజ్ ఇంజిన్‌గా కూడా ముద్ర వేసుకుంది టర్బోట్రాన్ 2.0 ఇంజిన్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+