విలన్ల దుర్మరణం: మాస్తిగుడి డైరెక్టర్ అరెస్టు
బెంగళూరు: దునియా విజయ్ హీరోగా నటిస్తున్న మాస్తిగుడి సినిమాలోని ప్రతినాయకులు అనీల్, ఉదయ్ జలసమాధికి కారణం అయిన కేసులో ఆ సినిమా దర్శకుడు నాగశేఖర్ ను బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు.
సోమవారం తిప్పగుండనహళ్ళి చెరువులో మాస్తిగూడి సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగతున్న సమయంలో 100 అడుగుల ఎత్తులో ఉన్న హెలికాప్టర్ నుంచి హీరో విజయ్, ప్రతినాయకులు అనీల్, ఉదయ్ నీళ్లలోకి దూకారు.

హీరో విజయ్ ప్రాణాలతో భయటపడటంతో అనీల్, ఉదయ్ ఇద్దరూ నీటిలో గల్లంతు అయ్యారు. బుధవారం ఒకరి భౌతికకాయాన్ని నీళ్లలో నుంచి బయటకు తీశారు. సోమవారం మద్యాహ్నం నుంచి నాగశేఖర్ మాయం అయ్యాడు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఐదు మంది మీద కేసులు నమోదు చేశారు. మంగళవారం రాత్రి మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్ పి. గౌడను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం దర్శకుడు నాగశేఖర్ ను అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి కోసం తావరకెరె పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications