షాకింగ్: శశికళ రూంలో జయలలితకు రాసిన సీక్రెట్ లేఖ, కళ్లు చెదిరే ఆస్తులు

చెన్నై: దివంగత తమిళనాడు సీఎం జయలలిత బతికి ఉన్నప్పుడు ఆమెకు ఓ రహస్య లేఖ వచ్చింది. ఈ విషయం తాజాగా వెలుగు చూసింది. ఆ రహస్య లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. గత ఏడాది తాము శశికళ గదిలో సోదాలు జరిపిన సమయంలో ఈ లేఖ దొరికిందని అధికారులు చెప్పారు.

ఇందులో కలకలం రేపిన గుట్కా కుంభకోణంకు సంబంధించిన వివరాలు ఉన్నాయని మద్రాస్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఐటీ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ వెడించారు.
గుట్కా స్కామ్ పై సీబీఐ దర్యాప్తును కోరుతూ డీఎంకే శాసనసభ్యుడు అంబజగన్ పిటిషన్ వేశారు.

 శశికళ గదిలో లేఖ

శశికళ గదిలో లేఖ

దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వేదనిలయంలోని శశికళ గదులను సోదాలు చేసేందుకు అనుమతించింది. ఆ సోదాలలో లేఖ బయటపడింది. ఆగస్ట్ 11, 2016 తేదీతో ఈ లేఖ ఉంది. ఐటీ ప్రిన్సిపల్ డైరెక్టర్ నుంచి ముఖ్యమంత్రి జయలలిత, డీజీపీలను ఉద్దేశిస్తూ అది వచ్చింది. ఈ కుంభకోణంలో రాష్ట్ర మంత్రి, ఉన్నతాధికారులు, పోలీసులకు సంబంధమున్నట్టు తేలిందని ఆయన పేర్కొన్నారు.

పలువురికి ముడుపులు

పలువురికి ముడుపులు

ప్రభుత్వంతో సంబంధాలున్న రాజకీయ పార్టీలకు కూడా ముడుపులు అందాయని ఆరోపించినట్లుగా అందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై వెంటనే స్పందించాలని, చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.

ఐటీ అధికారుల సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు

ఐటీ అధికారుల సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు

మరోవైపు, ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో కళ్లు చెదిరిపోయే రీతిలో శశికళ, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులు బయటపడినట్లుగా తెలుస్తోంది. పలు ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 4,500 కోట్ల విలువైన ఆస్తులను అప్పటికే గుర్తించారు. 80 నకిలీ కంపెనీలను గుర్తించారు. నకిలీ కంపెనీల పేరుతో 1800 ఎకరాల భూమిని వీరు కొనుగోలు చేశారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ. 150 కోట్లతో తమిళనాడులో ఏకంగా 1200 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు అధికారులు నిర్ధారించారని తెలుస్తోంది.

హార్డ్ డిస్క్‌ల్లో కీలక సమాచారం

హార్డ్ డిస్క్‌ల్లో కీలక సమాచారం

ఇదే సమయంలో శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు చెందిన 200 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. మరోవైపు, పోయెస్ గార్డెన్ లోని హార్డ్ డిస్క్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మరింత కీలక సమాచారం ఉండవచ్చని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+