టిసిఎస్ టెక్కీ దారుణ హత్య: పెళ్లయి మూడు నెలలే...
నోయిడా: 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. నోయిడాలోని సెక్టార్ 76లో సోమవారం సాయంత్రం ఈ హత్య జరిగింది. అంకిత్ చౌహాన్ అనే ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు మూడు నెలల క్రితమే వివాహమైంది. భార్య కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే.
మిత్రుడితో కలిసి ఇంటికి వెళ్తుండగా ఆ సంఘటన జరిగింది. వైట్ హోండా అకార్డ్‌లో ఇద్దరు వ్యక్తులు టెక్కీ ప్రయాణిస్తున్న టయోటా ఫార్చూనర్‌ను దాటేసి కాల్పులు జరిపారు. కాల్పుల్లో టెక్కీ చేతికి, మెడకు దెబ్బలు తగిలాయి. గాయపడిన అతన్ని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అయితే, అప్పటికే అతను మరణించాడు.
హంతకులు ఎవరనే విషయంపై పోలీసులు ఏ విధమైన క్లూలు కూడా దొరకడం లేదు. అంకిత్‌ను ఎందుకు హత్య చేశారనేది కూడా కనిపెట్టలేకపోతున్నారు. వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

అంకిత్ చౌహన్‌పైకి నాలుగు సార్లు కాల్పులు జరిపారని, ఆ సమయంలో అతను కారు నడుపుతున్నాడని, ఆఫీసులో తన భార్యను కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.
అంకిత్ కారును తమ కారుతో ఆగంతులు దాటేసి, కాస్తా పక్కకు తీసుకుని కాల్పులు జరిపారు. ఈ స్థితిలో అంకిత్ నియంత్రణ కోల్పోవడంతో అతని కారు చెట్టుకు ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగంతకుల్లో ఒకతను కిందికి దిగి అంకిత్ మెడపై కాల్పులు జరిపాడు.
అంకిత్ మిత్రుడు గగన్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, కారును నడపడం అతనికి రాదు. ఆ స్థితిలో ఒకతను వారిని కైలాస్ ఆస్పత్రికి చేర్చాడు. లూటీ, దోపిడీ, గలాటా కారణంగా జరిగిన హత్య కాదని పోలీసులు నమ్ముతున్నారు. పథకం ప్రకారమే అంకిత్‌ను హత్య చేశారని భావిస్తున్నారు. అంకిత్ కుటుంబ సభ్యులతోనూ మిత్రుడితోనూ పోలీసులు మాట్లాడుతున్నారు.
అంకిత్ తండ్రి ధరమ్ వీర్ చౌహాన్ మోడీ టైర్స్‌లో పని చేసి పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం మీరట్‌లో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. అంకిత్ భార్య అమీషా తండ్రి ముజఫర్‌నగర్‌లోని ఎస్డీ కాలేజీ డైరెక్టర్‌గా ఉన్నారు.












Click it and Unblock the Notifications