శబరిమల భక్తులకు బిగ్ అలర్ట్ - ఆ రెండు రోజుల దర్శనం పరిమితం..!!

శబరిమల లో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా రికార్డు సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఆలయ అధికారులు ఇందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేసారు. ఇక, వార్షిక మండల పూజకు వచ్చే భక్తుల కోసం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డ్ (టీడీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 25, 26 తేదీల్లో అయ్యప్ప ఆలయంలో వర్చువల్, స్పాట్‌ బుకింగ్‌లను పరిమితం చేయాలని నిర్ణయించింది.

50 వేల మందికే అనుమతి
ఈ నెల 26న శబరిమలలో మండల పూజకు సర్వం సిద్దం అవుతోంది. దీంతో, ఆలయ అధికారు లు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 25, 26 తేదీల్లో వరుసగా 50వేలు, 60వేలు మంది భక్తులను మాత్రమే దైవ దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. ఈ రెండు రోజుల్లో స్పాట్‌ బుకింగ్‌ - కేవలం 5000 మందికి మాత్రమే పరిమితం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25న థంక అంకి ఊరేగింపు శబరిమల సన్నిధానానికి (ఆలయ సముదాయం) చేరుకుంటుంది. దీంతో, భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.

Travancore Devaswom Board issues big alert for Ayyappa Devotees over virtual and spot darshanam bookings

ట్రస్టు బోర్డు నిర్ణయాలు
దీంతో, ఆ రోజు కేవలం 50 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇక..26వ తేదీన పవిత్ర మండల పూజ జరగనుంది. ఆ రోజు 60వేల మంది యాత్రికులను మాత్రమే కొండపై ఉన్న ఆలయంలోకి అనుమతించనున్నారు. పండగ రోజుల్లో భక్తుల రద్దీని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీబీ వెల్లడించింది. ఇదే సమయంలో అయ్యప్ప మండల పూజకు సన్నాహాలు పూర్తైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. మండల పూజ సందర్భం గా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణం గా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

పెరుగుతున్న రద్దీ
నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబరు 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ క్రమంలో తొలుత అయ్యప్ప స్వామిని 'తంకా అంకి'తో అలంకరించిన తర్వాత, పవిత్రమైన బంగారు వస్త్రాన్ని ఉత్సవ ఊరేగింపుతో ఆలయానికి తీసుకొస్తారు. తర్వాత మండల పూజ నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ తో అధికారులకు దర్శనం వేళ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆలయ బోర్డు సూచనలు చేసింది. దీంతో, ఈ రెండు రోజులు శబరిమలలో కుదించిన వర్చ్యువల్, స్పాట్ బుకింగ్స్ పై విధించిన పరిమితులు భక్తులు గుర్తించాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+