పాఠశాలలో అమ్మాయిల పట్ల అసభ్యంగా టీచర్

కడప/బెంగళూరు: కడప జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతని పైన గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉపాధ్యాయుడి విద్యార్థినులతో వికృత చేష్టలు ప్రదర్శిస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

సదరు కీచక ఉపాధ్యాయుడిని అప్పగించాలని పాఠశాలను చుట్టుముట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారిస్తున్నారు.

Teacher abused school girls

బెంగళరు చిన్నారి రేప్ పైన నివేదిక కోరిన కేంద్రం

కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఓ చిన్నారిపై పాఠశాల సిబ్బంది అత్యాచారానికి పాల్పడిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఉదంతంపై నివేదిక అందజేయాలంటూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆ పాఠశాలలో భద్రతా వైఫల్యం ఎందుకు చోటు చేసుకుందో వివరించాలని కూడా మానవ వనరుల శాఖ కోరింది. జులై 15న పాప రేప్‌కు గురైన విషయం వెలుగులోకి రావడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టడం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+