గర్ల్స్‌కు పోర్న్ చూపించిన టీచర్‌ను చితకబాదారు

కొంత మంది అమ్మాయిలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు పాఠశాలకు వెళ్లి గొడవ చేశారు. ఉపాధ్యాయుడిని కొట్టారు. పోలీసులను పిలిచారు. పోలీసులు అతన్ని తమ కస్టడీలోకి తీసుకున్నారు.
ఆరోపణలు నిజమని తేలితే ఉపాధ్యాయుడిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. తాము మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు జరుపుతున్నామని వారు చెప్పారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు కూడా తెలియజేసినట్లు వారు తెలిపారు.
ఉపాధ్యాయుడు ఎవరిపై కూడా లైంగిక దాడి జరపలేదని విచారణలో తేలినట్లు వారు చెప్పారు. స్పెషల్ క్లాసులు ఉన్నాయని చెప్పి పాఠశాలలో ఉండిపోవాలని విద్యార్థినులకు శ్రీవాస్తవ చెప్పినట్లు తల్లిదండ్రులను ఆరోపించారు. విద్యార్థినులు అందుకు నిరాకరించారు. కొంత మంది తప్పించుకుని వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను శ్రీవాస్తవ కొట్టిపారేశాడు. ఖజురహో, తాజ్ మహల్ చిత్రాలను పిల్లలకు చూపించినట్లు అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications