Teacher: హోమ్ వర్క్ చెయ్యలేదని మూడో తరగతి విద్యార్థిని కొట్టి చంపి గేట్ బయట, డైరెక్టర్ ఫినిష్!
పాట్నా/బీహార్: మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి హాస్టల్ లో ఉంటున్నాడు. హాస్టల్ నుంచి ఆ అబ్బాయి ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తున్నాడు. స్కూల్ టీచర్స్ విద్యార్థులకు ప్రతిరోజు హోమ్ వర్క్ ఇస్తున్నారు. మూడవ తరగతి అబ్బాయి క్రమం తప్పకుండా హోమ్ వర్క్ చేసుకుని వెళ్లి టీచర్లకు చూపిస్తున్నాడు. అయితే అనారోగ్యంతో ఉన్న ఆ అబ్బాయి రెండు రోజుల నుంచి హోమ్ వర్క్ సక్రమంగా చెయ్యడం లేదని తెలిసింది. హోమ్ వర్క్ చెయ్యలేదని అబ్బాయిని స్కూల్ టీచర్ దండించకుండా కొట్టి చంపేయడం కలకలం రేపింది.

ఫేమస్ స్కూల్
బీహార్ లోని గయా సమీపంలోని వజీర్ గంజ్-ఫతేపూర్ రహదారిలోని బధి బిఫా గ్రామం సమీపంలో లీటిల్ లీడర్స్ పబ్లిక్ స్కూల్ ఉంది. ఆ ప్రాంతంలో ఈ స్కూల్ చాలా ఫేమస్ అని సమాచారం. ఇదే స్కూల్ కు వికాస్ సింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఆ పరిసర ప్రాంతాల్లోని కుటుంబ సభ్యులు వాళ్ల పిల్లలను లిటిల్ లీడర్స్ పబ్లిక్ స్కూల్ లో చేర్పించారు.

హాస్టల్ లో ఉంటున్న అబ్బాయి
లిటిల్ లీడర్స్ పబ్లిక్ స్కూల్ లో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి హాస్టల్ లో ఉంటున్నాడు. హాస్టల్ నుంచి ఆ అబ్బాయి ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తున్నాడు. స్కూల్ టీచర్స్ విద్యార్థులకు ప్రతిరోజు హోమ్ వర్క్ ఇస్తున్నారు. మూడవ తరగతి అబ్బాయి క్రమం తప్పకుండా హోమ్ వర్క్ చేసుకుని వెళ్లి టీచర్లకు చూపిస్తున్నాడు.

గేట్ బయట మతిలేకుండా పడిపోయిన విద్యార్థి
స్కూల్ గేట్ సమీపంలో మూడో తరగతి చదువుతున్న అబ్బాయి మతిస్థిమితం లేకుండా పడిపోయి ఉన్న విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అబ్బాయిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అబ్బాయి చనిపోయి ఉన్నాడని వైద్యులు చెప్పారు.

హోమ్ వర్క్ చెయ్యలేదని చంపేశారు?
అనారోగ్యంతో ఉన్న ఆ అబ్బాయి రెండు రోజుల నుంచి హోమ్ వర్క్ సక్రమంగా చెయ్యడం లేదని తెలిసింది. హోమ్ వర్క్ చెయ్యలేదని అబ్బాయిని స్కూల్ టీచర్ దండించకుండా కొట్టి చంపేశారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. అబ్బాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో లిటిల్ లీడర్స్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వికాస్ సింగ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications