షాక్: పెళ్ళిరోజునే టీచర్ల తొలగింపు, 'రొమాన్సే కారణం'
శ్రీనగర్: పెళ్ళి రోజునే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లను స్కూల్ యాజమాన్యం తొలగించింది. పెళ్ళి పీటలపై ఉన్న నూతన వధూవరులను ఉద్యోగం నుండి తొలగిస్తూ ఆ స్కూల్ యాజమాన్యం షాకిచ్చింది. టీచర్ల రొమాన్స్ విద్యార్ధులకు ఇబ్బంది కలిగిస్తోందని స్యూల్ యాజమాన్యం ఆరోపించింది.
పెళ్ళి రోజునే శుభవార్త వినాలని ఎవరైనా కోరుకొంటారు. కానీ, పెళ్ళి పీటలపై ఉన్న సమయంలోనే కాబోయే నూతన దంపతులకు తాము పనిచేసే స్కూల్ యాజమాన్యం షాకిస్తోందని ఆ దంపతులు కలలో కూడ ఊహించలేదు.

పెళ్ళిరోజే షాకిచ్చిన స్కూల్ యాజమాన్యం
కాశ్మీర్ రాష్ట్రంలోని పులువామా జిల్లాలోని ట్రాల్ టౌన్‌లో ఓ ముస్లిం ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌లో తారిఖ్ భట్, సుమయా బషీర్ టీచర్లుగా పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరూ గర్ల్స్, జెంట్స్ క్యాంపస్‌లలో వేర్వేరుగా పనిచేస్తున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ ఈ ఎడ్యుకేషన్ సంస్థలో పనిచేస్తున్నారు.

నిశ్చితార్థం జరిగిన టీచర్లు
తారిఖ్ భట్, సుమయా బషీర్లకు ఇటీవలనే నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత వివాహం కోసం కుటుంబ సభ్యులు కొంతకాలం వేచి చూడాలని నిర్ణయం తీసుకొన్నారు.నిశ్చితార్థం అయినందున వీరిద్దరూ స్కూల్ ప్రాంగంణంలో కొంత చనువుగా ఉండేవారని స్కూల్ యాజమాన్యం ఆరోపణలు చేస్తోంది.అయితే ఏనాడూ కూడ ఈ విషయాన్ని వారిద్దరి దృష్టికి తీసుకెళ్ళలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

వివాహం కోసం టీచర్ల సెలవు
టీచర్లు వివాహం కోసం ఇద్దరు టీచర్లు సెలవు పెట్టారు. వీరిద్దరికి గత నెల 30వ, తేదిన వివాహం జరిగింది. అయితే వివాహం కోసం వారిద్దరు సెలవు పెట్టారు. వారిద్దరికీ సెలవు కూడ స్కూల్ యాజమాన్యం సెలవు మంజూరు చేసింది.వారిద్దరూ వివాహం చేసుకొనే రోజునే విధుల నుండి తప్పిస్తున్నట్టు స్కూల్ యాజమాన్యం వారికి సమాచారాన్ని పంపింది.పెళ్ళి రోజున కొత్త దంపతులకు సంతోషమే లేకుండా చేశారు.

విద్యార్థులకు టీచర్ల రొమాన్స్‌తో ఇబ్బందులు
ఈ విషయమై స్కూల్ ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదని మీడియా కథనాలు ప్రసారం చేసింది. అయితే స్కూల్ చైర్మెన్ బషీర్ మసూది మాత్రం టీచర్లు మాత్రం స్కూల్ ఆవరనలో రొమాన్స్ విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తోందని ఆరోపించాడు. ఈ కారణంగానే విధుల నుండి తప్పించారని ఆయన ప్రకటించారు. స్కూల్ యాజమాన్యంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications