దుస్తులు విప్పి, అమ్మాయిని ఎక్కడెక్కడో ముట్టుకోబోయిన టీచర్
ముంబై: ఎక్కువ మార్కులు వేస్తానని నలుగురు విద్యార్థినీలను లైంగికంగా వేధించిన ఓ కంప్యూటర్ ఉపాధ్యాయుడిని నలసోపారా పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. ఓ పదో తరగతి విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సులేమన్‌ను అరెస్టు చేశారు.
45 ఏళ్ల సులేమన్ ఈస్ట్ నలసోపారా పాఠశాలలో పని చేస్తున్నాడు. అతను గత ఆరు నెలలుగా విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు. దుస్తులు విప్పాలని చెబుతూ వారిని ఎక్కడెక్కడో ముట్టుకోవడం కాకుండా, డ్యాన్స్ చేయాలని వేధించాడు. అందుకు ప్రతిగా మంచి మార్కులు వేస్తానని చెప్పాడు.

నిందితుడు సులేమన్.. ఓ పదహారేళ్ల విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దానిని వీడియో తీసి.. చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దీంతో ఆ బాలిక పాఠశాలకు వెళ్లడం మానేసింది. ఇంట్లో భోజనం కూడా చేయడం లేదు. దీంతో అనుమానం వచ్చిన తండ్రి విషయం తెలుసుకొని, పోలీసులను ఆశ్రయించాడు.
ఫిబ్రవరి 6న ఫేర్‌వెల్ పార్టీ సందర్భంగా నిందితుడు తన కూతురును అతని ఇంటికి తీసుకు వెళ్లాడని, అక్కడ తన కూతురు దుస్తులు విప్పాడని, తన కూతురును తాకే ప్రయత్నం చేశాడని, తన కూతురు అక్కడి నుండి తప్పించుకొని వచ్చిందని ఓ తండ్రి ఫిర్యాదు చేశాడు.
పోలీసులు నిందితుడు పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో ఆ నిందితుడు మరో ముగ్గురు బాలికలను కూడా వేధించినట్లుగా తేలింది. మంచి మార్కులు వేస్తానని కొందరికి, క్వశ్చన్ పేపర్ ముందే చూపిస్తానని కొందరికి ఆశ చూపించి లోబరుచుకునే ప్రయత్నం చేశాడు.












Click it and Unblock the Notifications