బాలుడిని బెత్తంతో కొడితే టీచర్ ను చితకబాదారు

ఇంఫాల్: పిల్లాడిని బెత్తంతో కొట్టాడని ఆరోపిస్తూ టీచర్ మీద బాలుడి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల కార్యకర్తలు దాడి చేసిన సంఘటన మణిపూర్ లో జరిగింది. చావుదెబ్బలు తిన్న టీచర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసుల కథనం మేరకు - ఓ ప్రయివేటు పాఠశాలలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇంఫాల్ లో సెయింట్ జోసఫ్ పాఠశాలలో 12 సంవత్సరాల బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్ లో కంప్యూటర్ సైన్స్ టీచర్ ఉన్నాడు.

Teacher Thrashed For Allegedly Caning Student, Hospitalised in Manipur

బాలుడు తరగతి గదిలో తప్పు చెయ్యడంతో టీచర్ గమనించాడు. తరగతిలో ని విద్యార్థుల సమక్షంలో బాలుడిని బెత్తంతో కొట్టాడు. ఇంటికి వెళ్లిన బాలుడు కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు.బాలుడి కుటుంబ సభ్యులు ఒక విద్యార్థి సంఘం నాయకులకు సమాచారం ఇచ్చారు.

అందరూ కలిసి స్కూల్ దగ్గరకు వెళ్లారు. కంప్యూటర్ సైన్స్ టీచర్ ను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. టీచర్ సృహ కొల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్ దగ్గరకు చేరుకుని సమాచారం తెలుసుకున్నారు. టీచర్ మీద దాడి చేసిన 16 మంది మీద కేసు నమోదు చేసి అందరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+