ఈ టీచర్‌కు ఏం పోయే కాలం..11 ఏళ్ల బాలుడితో ఛీ ఛీ
బుద్ధులు చెప్పాల్సిన టీచర్ వక్రబుద్ది చూపించింది. చదువు చెప్పాల్సిన టీచర్ దారి తప్పింది. గుజరాత్‌లో 11 ఏళ్ల బాలుడితో ఒక ఉపాధ్యాయురాలు లేచిపోయిన సంఘటన సంచలనంగా మారింది. గుజరాత్‌లో జరిగిన ఈ సంఘటన దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఒక ఉపాధ్యాయురాలు, విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాల్సిన వ్యక్తి, కేవలం 11 ఏళ్ల బాలుడితో లేచిపోవడం సమాజంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది నమ్మశక్యం కాని విషయం, ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తికి ఒక పవిత్రత ఉంటుంది. గురువు స్థానంలో ఉన్నవారు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి, వారిని సరైన మార్గంలో నడిపించాలి.
కానీ ఇక్కడ జరిగింది అందుకు విరుద్ధంగా జరిగింది. 11 బాలుడికి ట్యూషన్ చెబుతోంది ఓ టీచర్. ఆ పిల్లాడు తరచూ ఓ టీచర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సడన్‌గా వీరిద్దరు కనిపించడం మానేశారు.టీచర్ ఇంటికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేశారు. దాంతో అసలు విషయం బయటపడింది. అందులో ఆ బాలుడు టీచర్‌తో కలిసి.. ఓ షాపుకి వెళ్లి కావాల్సిన వస్తువులు కొనుగొలు చేశారు.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాంతో.. పిల్లాడు ఇంటికి రాకపోవడానికి ఆ టీచరే కారణం అని అందరికి అర్థం అయింది. ఈ విషయం బాలుడి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఉపాధ్యాయురాలుతో పాటు ఆ బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థితో ఇలాంటి సంబంధం పెట్టుకోవడం తీవ్రమైన నేరం. ఇది పోక్సో చట్టం (Protection of Children from Sexual Offences Act) కిందకు వస్తుంది.నిందితురాలికి కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా, ఇలాంటి సంఘటనలు పాఠశాలల్లో పిల్లల భద్రత గురించి ఆందోళన కలిగిస్తాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలి, కానీ ఇక్కడ ఒక ఉపాధ్యాయురాలే చట్టాన్ని ఉల్లంఘించి, ఒక చిన్నారి జీవితాన్ని ప్రమాదంలో పడేసింది.పోలీసులు త్వరగా వారిని గుర్తించి, బాలుడిని సురక్షితంగా తిరిగి తీసుకురావాలని ,నిందితురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలలు ,సమాజం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications