Rohit Sharma: భార్యతో కలిసి డాన్స్ తో దుమ్మురేపిన హిట్ మ్యాన్..!!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిట్ మ్యాన్ క్రికెట్ గ్రౌండ్ లో కాదు..ఒక పెళ్లి వేడుకలో తన స్టెప్పులతో దుమ్ము రేపారు. ఆసీస్ తో ప్రారంభమైన వన్డే సిరీస్ లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఈ రోజు (శుక్రవారం) తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు రోహత్ దూరంగా ఉన్నారు. తన బావ మరిది పెళ్లి కోసం ఈ మ్యాచ్ కు గైర్హాజరు అయ్యారు. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రోహిత్ శర్మ తన సతీమణితో కలిసి చేసిన డాన్స్ ట్రెండింగ్ అవుతోంది.

డాన్స్ తో దుమ్ము రేపిన రోహిత్
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనలోని మరో టాలెంట్ ను బయట పెట్టారు. తన భార్య రితికా సోదరుడు కృనాల్ పెళ్లి వేడుకలో తన డాన్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. గురువారం రాత్రి రోహిత్ శర్మ బామ్మర్ది వివాహం జరిగింది. ఈ వేడుకలో పాల్గనేందుకు ఆసీస్ తో తొలి వన్డేకు రోహిత్ దూరమయ్యారు. ఈ అంశం పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. రోహిత్ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకించగా.. మరి కొందరు అభిమానులు మాత్రం రోహిత్ కు పర్సనల్ లైఫ్ ఉంటుందంటూ అండగా నిలిచారు. అటు ఆసీస్ తో మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన హార్డిక్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
బార్యతో కలిసి హ్యాపీ మూడ్ లో
ఇదే సమయంలో రోహిత్ పెళ్లి వేడుకలో చేసిన సందడి వీడియో వైరల్ అవుతోంది. తన భార్య తో కలిసి డాన్స్ చేస్తూ రోహిత్ ఫుల్ హ్యాపీ మూడ్ లో కనిపిస్తున్నాడు. రోహిత్ స్టైలిష్ గా డాన్స్ చేసాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రోహిత్ పాములా చేతులు కదుపుతూ భార్యతో కలిసి స్టెప్పులు వేశాడు. దీనికి రోహిత్ ఫ్యాన్స్ లైక్స్ కొడుతున్నారు. వైరల్ చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. బ్యాట్ తోనే కాదు హిట్ మ్యాన్ డాన్స్ తోనూ దుమ్ము రేపుతున్నాడంటూ పోస్టింగ్స్ చేస్తున్నారు. రోహిత్ లో ఇప్పటి వరకు కనిపించినని కొత్త యాంగిల్ ఇప్పుడు ఈ వీడియో తో బయటకు వచ్చింది. మరి కొందరు తీన్మార్ స్టెప్స్ కూడా చూపించాలంటూ కామెంట్స్ పోస్ట్ చేసారు.

ఐపీఎల్ సందడి వేళ..ఆసీస్ తో వన్డే సిరీస్
ఈ రోజు నుంచి ఆసీస్ తో ప్రారంభమైన వన్డే సిరీస్ లో టీమిండియా మొత్తం మూడు మ్యాచ్ లు ఆడనుంది. 2-1తో టెస్ట్ సిరీస్ ను దక్కించుకున్న భారత్ వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. ఆస్ట్రేలియా సైతం టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇక వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వెన్నునొప్పి కారణంతో అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న పొట్టి క్రికెట్ పండుగ వేళ ఆసీస్ తో స్వదేశీ గడ్డ పైన ఆడుతున్న ఈ వన్డే సిరీస్ టీమిండ్ ప్లేయర్స్ కు కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications