నా భర్త కామపిశాచి .. లేదు లేదు.. నా భార్యకు ఎఫైర్ ఉంది..లక్ష కోట్ల కంపెనీలకు అధిపతి సంచలనం
ప్రసన్న శంకర్ నారాయణ ..ఈ పేరు తెలియనిబిజినెస్ మేన్ ఉండరు. ఎందుకంటే సామాన్య కుటుంబంలో పుట్టి, ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీలకు ఆయన అధిపతిగా మారారు. HR టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సింగపూర్‌కు చెందిన క్రిప్టో సోషల్ నెట్‌వర్క్ 0xPPL.com వ్యవస్థాపకుడుగా ప్రసన్న శంకర్ నారాయణకు మంచి గుర్తింపు ఉంది. అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు ఆయన పెట్టారు.చెన్నైలో పుట్టిన ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య దంపతుల విడాకుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది.వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు.దివ్య, ఆమె కుమారుడు అమెరికా పౌరులు.విడాకులకు దారి తీసిన పరిస్థితులను తన ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు ప్రసన్న శంకర్ నారాయణ. తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని.. దీనిపై గొడవలు జరిగాయని వెల్లడించాడాయన. భర్త ప్రసన్న శంకర్ నారాయణపై భార్య దివ్య సంచలన ఆరోపణలు చేశారు.ప్రసన్న శంకర్ నారాయణ ఒక కామపిశాచి అని, రహస్యంగా మహిళల వీడియోలు రికార్డు చేసేవాడని ఆరోపించారు.

తన పేరిట ఉన్న ఆస్తులను కూడా బదలాయించుకున్నాడని దివ్య ఆరోపించారు.విచారణ చేసిన సింగపూర్ పోలీసులు.. భర్త ప్రసన్న శంకర్ నారాయణకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే సమయంలో చెన్నైకి వచ్చిన దివ్య ప్రసన్న శంకర్ నారాయణ తన కుమారుడిని కిడ్నాప్ చేశాడని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ విషయం తెలిసిన శంకర్ నారాయణ.. కుమారుడు తన దగ్గర సంతోషంగా ఉన్నాడని..ఆడుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు షేర్ చేశారు.
భార్య దివ్య కంప్లయింట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉన్నందుకు చెన్నై పోలీసులు..తనను రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని ప్రసన్న శంకర్ నారాయణ ఆరోపించారు.అమెరికా, సింగపూర్ ఇచ్చిన క్లీన్ చిట్ కాపీలు, కోర్టు తీర్పులతో శంకర్ నారాయణ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో చెన్నై పోలీసులు సైతం ఈ కేసులో ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications