జుట్టు ఊడిపోతోందని టెక్కీ ఆత్మహత్య
మధురై: జుట్లు ఊడిపోతుందని మానసికంగా వేధనకు గురైన ఆర్. మిథున్ రాజ్ అనే టెక్కీ ఆత్మహత్య చేసుకొన్న ఘటన మధురైలో చోటు చేసుకొంది. మానసికంగా కుంగిపోయిన మిథున్ రాజ్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
బెంగుళూరులోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మిధున్‌రాజ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మిధున్ రాజ్ కు చర్మసంబంధమైన సమస్యలున్నాయి.

ఈ కారణంగా ఆయన తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి తల వెంట్రులకు ఊడిపోకుండా ఉండేందుకుగాను ఆయన ఎన్నో రకాల మందులను వాడిన ఫలితం లేకుండా పోయింది.
మిథున్‌రాజ్ ఇన్పోసిస్ లో తన కెరీర్‌ను ప్రారంభించారు.తొలుత చెన్పైలోని ఇన్పోసిస్ లో ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయన బెంగుళూరు ఐటీ కంపెనీలో గత ఏడాది చేరాడు.
మిథున్‌రాజ్ తండ్రి చాలా కాలం క్రితమే చని.పోయాడు. మిథున్ రాజ్ తో ఆయన తల్లి వసంతి కూడ ఉంటుంది. అయితే మిథున్ రాజ్ కు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. అయితే వెంట్రుకలు రాలిపోతున్నాయని మిథున్ రాజ్ మానసికంగా వేదనకు గురయ్యాడు.
ఈ కారణంగానే మిథున్ రాజ్ కొన్ని వారాల నుండి విధులకు హజరుకాకుండా లీవ్‌లో ఉన్నాడు.ఆదివారం నాడు మిథున్ రాజ్ తల్లి గుడికి వెళ్ళిన సమయంలో మిథున్ రాజ్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications