ఫేస్‌బుక్ పెళ్ళి ఫొటోలపై గొడవ: టెక్కీ ఆత్మహత్య

 Techie hangs himself after fight with wife over photos on Facebook
చెన్నై: తన భార్యతో గొడవపడిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మనస్తాపంతో తమిళనాడు రాజధాని చెన్నైలో గల మైలాపూర్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి - ఫేస్‌బుక్‌లో తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను తొలగించేందుకు భార్య అంగీకరించకపోవడంతో.. ఆమెతో తీవ్ర వాగ్వాదం చేసుకున్న భర్త మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన చందన్ కుమార్ సింగ్ తమిళనాడు రాష్ట్రం అల్వార్‌పేట్‌లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు. గత మూడు నెలల క్రితం తన సహాద్యోగి సంధ్యను వివాహం చేసుకున్నాడు. సంధ్య తమ మతానికి చెందినది కాకపోవడంతో వారి వివాహానికి అతని తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వారికి తెలియకుండానే చందన్ సంధ్యను వివాహం చేసుకున్నాడు.

వివాహ విషయాన్ని తెలుసుకున్న చందన్ తల్లిదండ్రులు కూడా ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచారు. తమ కుమారుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడని తమ బంధువులకు చెప్పారు. అయితే ఫేస్‌బుక్‌లో పెట్టిన చందన్ వివాహ ఫొటోలను చూసిన వారి బంధువు ఒకరు చందన్ తల్లిదండ్రులను ఈ విషయం గురించి అడిగాడు. ఇతర బంధువులు కూడా ఆ పొటోలను చూసి తల్లిదండ్రులను అడగడం మొదలుపెట్టారు. దీంతో కొన్ని రోజుల తర్వాత వివాహ ఫొటోలను ఫేస్‌బుక్ నుంచి తొలగించాలని చందన్‌ను తన తల్లిదండ్రులు కోరారు.

తన తల్లిదండ్రుల ఒత్తిడితో ఫొటోలను ఫేస్‌బుక్ నుంచి తొలగించాలనుకున్న చందన్ తన భార్యను ఈ విషయంపై సంప్రదించగా ఆమె అందుకు నిరాకరించింది. దీంతో వారిద్దరి మధ్య శనివారం రాత్రి తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపం చెందిన చందన్ సింగ్ తన గదిలోకి వెళ్లి తాళం పెట్టుకున్నాడు. ఆదివారం ఉదయం నిద్రలేచిన సంధ్య తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కుమారుని మృతి పట్ల సింగ్ తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా సింగ్ తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తన ల్యాప్ టాప్ దగ్గర వదిలిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+