బిట్‌కాయిన్ ఇన్వెస్టర్లకు రూ 42 లక్షలు టోకరా: టెక్కీ అరెస్టు
పూణే: బిట్ కాయిన్ ఇన్వెస్టర్లను మోసం చేసిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరును పోలీసులు అరెస్టు చేశారు. క్రిప్టోకరెన్సీ మోసాలకు సంబంధించిన మొదటి కేసు మహారాష్ట్రలో బహుశా ఇదే. మంగళవారంనాడు టెక్కీని అరెస్టు చేశారు.
బిట్ కాయిన్స్‌లోనూ, ఇతర క్రిప్టోకరెన్సీల్లోనూ పెట్టుబడులు పెట్ిటన వ్యక్తులను ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని మోసం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. వారి పెట్టుబడి డబ్బులను గానీ, లాభాలను గానీ అతను ఇవ్వలేదు.

టెక్కీపై నాలుగు కేసులు...
ప్రజలను 42 లక్షల రూపాయల మేర మేసం చేసినందుకు టెక్కీపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. 2017 ఆగస్టు నుంచి టెక్కీ తనను 13 లక్షల రూపాయల మేర మోసం చేశాడని పూణే - సతారా రోడ్డులోని 46 ఏళ్ల మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టెక్కీని అరెస్టు చేసినట్లు...
సతారా రోడ్డులో నివసించే ఆకాశ్ కంతిలాల్ సంచేటి అనే 27 ఏళ్ల టెక్కీని పోలీసులు అరెస్టు చేశారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సదాశివ పేటలో సంచేటి చిన్నపాటి సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతున్నాడు. గత రెండు రోజుల్లో పోలీసులకు మరో నాలుగు పిర్యాదులు అందాయి.

అతను తనను కలిసి...
సంచేటి తనను 2017 ఆగస్టులో కలిసి బిట్‌కాయిన్స్‌లోనూ ఇతర వర్చువల్ కెన్సీల్లోనూ పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఇస్తానని హామీ ఇచ్చినట్లు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. నాలుగు నెలల్లో ఆన్‌లైన్ ద్వారా ఆమె 13 లక్షల రూపాయలను ఆ టెక్కీ ఖాతాలోకి బదిలీ చేసింది. అయితే, తాను పెట్టుబడిన మొత్తాన్ని గానీ, లాభాలను గానీ అతను తనకు ఇవ్వలేదని ఆమె ఫిర్యాదు చేసింది.

అదిలా జరిగింది.
బిట్ కాయిన్స్‌లో మహిళ పెట్టుబడి పెట్టడం ప్రారంభించినప్పుడు పుంజుకుంటూ వచ్చిందని, ఆ తర్వాత బిట్‌కాయిన్ విలువ తగ్గిపోయి నష్టాలు వచ్చాయని, దీంతో ంసచేటి డబ్బులను ఇతర వర్చువల్ కరెన్సీలకి బదిలీ చేయడానికి ప్రయత్నించాడని, వాటిలో కూడా నష్టాలు వచ్చాయని పోలీసులు అంటున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications