కిడ్నాప్ యత్నం, ఆటోలో నుండి దూకిన మహిళా టెక్కీ

థానే: తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ ఆటోలో నుండి దూకిన సంఘటన థానేలో జరిగింది. 24 ఏళ్ల యువతిని ఓ ఆటో డ్రైవర్ అపహరించేందుకు ప్రయత్నించడంతో ఆమె కిందకు దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. స్వప్నాలీ లాడ్ అనే టెక్కీ టీసీఎస్‌లో పని చేస్తోంది. విధులు ముగించుకొని శుక్రవారం రాత్రి గం.9.15 నిమిషాలకు ఓ ఆటో ఎక్కింది. ఆమె కోల్షేట్‌లో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు కపుర్‌బావ్డీ నాకాలో ఆటో ఎక్కింది.

Techie jumps out of auto to foil abduction bid in Thane; seriously hurt

ఆటో డ్రైవర్ కోల్షేట్ వైపుకు తీసుకు వెళ్లే బదులు బీవండి వైపుకు దారి మళ్లించాడు. దీంతో ఆ యువతి భయాందోళనకు గురైంది. ఆటోను ఆపాలని కేకలు వేసింది. ఆటో డ్రైవర్ మాత్రం వినలేదు. దీంతో ఆమె ఆటో రిక్షా నుండి బయటకు దూకేసింది. వెళ్తున్న ఆటో నుండి దూకేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. తలకు, కడుపుకు గాయాలయ్యాయి.

స్థానికులు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అఖ్కడి నుండి మరో ఆసుపత్రికి తరలించారు. ఆదివారం యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 364, 511 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ప్రకారం ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇప్పటి వరకు రెండు మేజర్ సర్జరీలు అయ్యాయి. సంఘటన జరిగినప్పటి నుండి ఆమె కోమాలో ఉంది. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+