రోడ్డుపై వాగ్వాదం: టెక్కీని తుపాకీతో కాల్చేశాడు

నోయిడా: చిన్న గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. చివరకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణం మీదకు తెచ్చింది. రెండు బైకులు ఢీకొట్టిన ఘటనలో ఘర్షణ పడి ఓ వ్యక్తి మరో వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఘజియాబాద్‌లోని విజయనగర్‌కాలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చంద్రకాంత్ త్యాగి(28) తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో బైక్‌పై వస్తున్న మరో వ్యక్తి సెక్టార్ 60 వద్ద వారి బైకును ఢీకొట్టాడు. దీంతో త్యాగి, ఢీకొట్టిన వ్యక్తికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

Techie shot at in Noida road rage

దీంతో ఆగ్రహానికి గురైన అవతలి వ్యక్తి తుపాకీతో త్యాగి తొడపై కాల్చాడు. సాయం చేయాలని త్యాగి భార్య పల్లవి ఏడుస్తూ కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే త్యాగిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

కాగా, దాడికి పాల్పడిన అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని సిసి కెమెరా ఫుటేజీలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+