క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటుకు టెక్కీ మృతి
పూణే: మహారాష్ట్రలోని పూణేలో విషాద సంఘటన చోటు చేసుకుంది. విధి వక్రించి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. హింజేవాడీలోని బహుళ జాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్న 45 ఏళ్ల సాఫ్ట్‌వేర్ వృత్తినిపుణుడు పిడుగు పడి మరణించాడు.
ఆదివారం సాయంత్రం కంపెనీ మైదానంలో క్రికెట్ ఆడుతుండగా అతనిపై పిడుగు పడింది. మిత్రుడితో కలిసి నిలేష్ కుమార్ బి క్రికెట్ ఆడుతుండగా వర్షం పడడం ప్రారంభమైంది. మైదానంలోని ఓ చెట్టు కిందికి వెళ్లి అతను నించుడున్నాడు.

చెట్టు కింద నించున్న నిలేష్ కుమార్‌పై పిడుగుడు పడింది. దాంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు.
కంపెనీలో నిలేష్ కుమార్ ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.












Click it and Unblock the Notifications