టెక్కీ ఆత్మహత్య: పని ఒత్తిడి భరించలేకనే...?

కేరళ రాష్ట్రంలోని అలువా ప్రాంతానికి చెందిన రేష్మ చెన్నైలోని అసెండస్ ఐటి పార్క్‌లోని విజువల్ గ్రాఫిక్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరింది. బెంగళూరులో తన చదువును పూర్తి చేసుకున్న రేష్మ అనంతరం ఈ కంపెనీలో గత సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ డెవలపర్‌గా విధులు నిర్వహిస్తోంది. వేలచేరిలోని ఓ ఉమెన్స్ హాస్టల్‌లో ఆమె ఉంటోంది. తను ఆత్మహత్య చేసుకునే ఒక రోజు ముందు కంపెనీలో పని ఒత్తిడి తీవ్రంగా ఉందని చెప్పినట్లు రేష్మ సోదరుడు రణ్‌దీప్ తెలిపారు.
తన ఉద్యోగం సంతృప్తిని కలిగించనట్లయితే తనను ఇంటికి రావాల్సిందిగా కోరామని రేష్మ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఉద్యోగం చేయాలనే తన కలను నెరవేర్చుకోవాలని రేష్మ అన్నట్లు వారు చెప్పారు. కాగా ఆత్మహత్య చేసుకోవాలన్న దోరణిలో రేష్మ ప్రతీ రాత్రి రోదించేదని ఆమె సహోద్యోగి పోలీసులకు తెలిపారు.
తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తన తల్లిదండ్రులకు, సోదరుడు, సోదరి రెమితలకు, వేర్వేరుగా నాలుగు సూసైడ్ నోట్లను వదిలిపెట్టి రేష్మ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తను ఒంటిరిగా ఉన్నాననే ఆలోచనతోనే రేష్మ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా రేష్మ పనిచేసిన కంపెనీలోని ఉద్యోగులు ఆమె ఆత్మహత్యపై స్పందించేందుకు నిరాకరించారు.












Click it and Unblock the Notifications