బాయ్‌ఫ్రెండ్‌తో రాసలీల: భార్యను ట్రాప్ చేసిన టెక్కీ, విడాకులు

బెంగళూరు: ఓ సాప్టువేర్ ఇంజినీర్ తన భార్యకు అక్రమ సంబంధం ఉందని నిరూపించి, ఆమె నుంచి విడాకులు పొందిన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. తన భార్య పైన తనకు ఉన్నది అనుమానం కాదని, అది వాస్తవమని కోర్టుకు నిరూపించి మరీ విడాకులు పొందాడు.

టెక్నాలజీ సాయంతో తన భార్య తనను మోసగిస్తున్న వైనాన్ని వెలుగులోకి తెచ్చి నిరూపించాడు. బెంగళూరులో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న 31 ఏళ్ల యువకుడు తన భార్య, మూడేళ్ల కూతురుతో కలిసి ఓ ప్లాట్‌లో ఉంటున్నాడు.

ఫిబ్రవరి 2015లో అతనికి భార్య పైన అనుమానం వచ్చింది. తన ఇంట్లో సిగరేట్ తాగేవాళ్లు ఎవరూ లేరు. కానీ ఇంట్లో ఓ మూలన సిగరేట్ పీక పడేసి ఉంది. దాని గురించి భార్యను అడగగా.. తనకు ఏమీ తెలియదని నమ్మబలికింది.

 Techie traps cheating wife, gets divorce

ఆ సమాధానంతో భార్య పైన అతనికి అనుమానం వచ్చింది. భార్య పైన నిఘా పెట్టాడు. ఇంట్లో ఆమెకు తెలియకుండా నాలుగైదో చోట్ల కెమెరాలు అమర్చాడు. అప్లికేషన్లను వినియోగించి భార్య ఫోన్‌ను తన ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేశాడు.

అయితే, కొన్ని రోజుల పాటు ఆయన అనుమానాలకు సంబంధించిన ఆధారాలు దొరకలేదు. కానీ జూలైలో ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని, వచ్చేటప్పుడు గర్భ నిరోదక మాత్రలు తెమ్మని చెప్పింది. ఆ మాటలు టెక్కీ చెవిన పడ్డాయి.

లివింగ్ రూంలో, బాత్ రూంలో, బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆమె సాగించిన రాసలీలలు రికార్డయ్యాయి. ఆ ఫుటేజీలతో అతను కోర్టుకు వెళ్లి విడాకుల కోసం అభ్యర్థించాడు. వాటిని ల్యాబ్‌కు పంపించి, నిజమైనవేనని తేల్చారు. దీంతో ఆ టెక్కీకి కోర్టు విడాకులు మంజూరు చేసింది. పాప సంరక్షణ బాధ్యతను తండ్రికి అప్పగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+