ఓ టెకీ కథ : అడిగినందుకే కోసేసిన భార్య
బెంగుళూరు : పోలీస్ స్టేషన్ మెట్లెక్కే భార్య భర్తల కేసుల్లో సగం కేసులు భర్తల వేధింపులకు సంబంధించినవే ఉంటాయి. గృహ హింస చట్టం వచ్చిన తర్వాత మహిళలు కూడా భర్తల ఆకృత్యాల పట్ల ఉపేక్షించే ధోరణితో కాకుండా, వేధించే భర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు. మహిళల సంగతి ఓకె. మరి భార్య బాధితుల సంగంతేంటి..! తాజాగా తన భార్య బారి నుండి తనను రక్షించాలని ఓ భర్త పోలీసులను ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.
బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే ఓ వ్యక్తి.. ఓరోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే, భార్య ఎవరితోనో మొబైల్ చాట్ చేస్తూ కనిపించింది. అయితే, భార్య మొబైల్ లాక్కుని చాటింగ్ లో ఏం మాట్లాడుతోందా.. అని చూసిన సదరు భర్త అందులో ఉన్న బూతు పురాణం చూసి అవాక్కయ్యాడు. ఏంటిది.. అని భార్యను నిలదీయడమే ఆలస్యం, కిచెన్ లో నుంచి కత్తి పీటను తీసుకొచ్చిన ఆ భార్య భర్తపై ఎడాపెడా గాయాలు చేసింది.

గాయాలతో పడి ఉన్న ఆ భార్య బాధితుడి పరిస్థితిని గమనించి చుట్టు పక్కల వాళ్లు ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకుని భోరుమని విలపించాడు బాధిత భర్త. సదరు భర్త పరిస్థితిని చూసిన పోలీసులు కేసును ఎలా పరిష్కారించాలోనన్న డైలామాలో పడ్డారు. కాగా.. ఆ సాఫ్ట్ ఇంజనీర్ భార్య చెప్తున్న కథనం మాత్రం వేరేలా ఉంది.
తన భర్తే అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడని, కావాలని కట్టు కథలు అల్లి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడని ఆరోపిస్తోంది. పోలీసులు దర్యాప్తు పూర్తయితే గానీ అసలు విషయం బయటపడేలా లేదు.












Click it and Unblock the Notifications