Techie wife: సర్ఫ్ నీళ్లతో భర్త ల్యాప్, మొబైల్ ఫోన్ కడిగేసిన భార్య, శుభ్రం పేరుతో సినిమా చూపించింది !
బెంగళూరు: సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న యువకుడు కుటుంబ సభ్యులు చూపించిన ఎంబీఏ పూర్తి చేసిన యువతిని వివాహం చేసుకున్నాడు. భర్త ఇంగ్లాండ్ లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తుండటంతో అతనితో కలిసి భార్య విదేశాలకు వెళ్లింది. రెండు సంవత్సరాలు దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక బిడ్డ పుట్టిన తరువాత భార్య శుభ్రత పేరుతో ఆమె భర్తకు సినిమా చూపించింది. రానురాను పరిస్థితులు మారిపోతూ వచ్చాయి. భార్య తీరుతో భర్త విసిగిపోయాడు. పెద్దలు రాజీ చేసి దంపతులను ఒక్కటి చేశారు. ఆఫీసుకు వెళ్లి వస్తున్న భర్త దుస్తులతో పాటు బూట్లు డిటెర్జెంట్ సబ్బు, సర్ఫ్ తో క్లీన్ చెయ్యడం మొదలు పెట్టింది. రెండో బిడ్డ పుట్టిన తరువాత భార్య శుభ్రత పైత్యం నసాలానికి ఎక్కింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న భర్త ల్యాప్ టాప్, అతని మొబైల్ ఫోన్ సర్ఫ్ లో నీళ్లలో నానబెట్టి శుభ్రం చెయ్యడం మొదలుపెట్టింది. భర్త, ఇద్దరు పిల్లలను నెల రోజులు ఇంటి నుంచి బయటకు తరిమేసి ఇల్లు మొత్తం ఆమె ఒక్కటే శుభ్రం చేసింది. భార్య తీరుతో విసిగిపోయిన భర్త నన్ను మీరే కాపాండండి దేవుడా, నాకు విడాకులు ఇప్పించండి అంటూ పోలీసులను ఆశ్రయించాడు. తనకు విడాకులు కావాలని భర్త పట్టుబట్టాడు. అయితే భార్య మానసిక ఆరోగ్యంగానే ఉందని ఆమెకు కౌన్సిలింగ్ చేసిన వైద్యులు, నిపుణులు అంటున్నారు.

సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో పెళ్లి
ఐటీ హబ్ బెంగళూరులోని ఆర్ టీ నగర్ లో సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న సూరజ్ అతని కుటుంబ సభ్యులు చూపించిన బెంగళూరుకు చెందిన ఎంబీఏ పూర్తి చేసిన రమ్యా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని 2009లో వివాహం చేసుకున్నాడు.

ఇంగ్లాండ్ లో ఉద్యోగం
ఇంగ్లాండ్ లో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సూరజ్ ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. సూపర్ జు వివాహం చేసుకున్న వెంటనే రమ్యా ఆమె భర్తతో కలిసి విదేశాలకు వెళ్లింది. రెండు సంవత్సరాల పాటు సూరజ్, రమ్యా దంపతులు చాలా సంతోషంగా జీవించారు. రెండు సంవత్సరాలు సూరజ్, రమ్యా దంపతులకు ఇంగ్లాండ్ లోనే ఉన్నారు.

శుభ్రం విషయంలో భార్య రాజీపడదు
రెండు సంవత్సరాల పాటు సూరజ్, రమ్యా దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక బిడ్డ పుట్టిన తరువాత సూరజ్ భార్య రమ్యా శుభ్రత పేరుతో ఆమె భర్తకు సినిమా చూపించింది. రానురాను ఇంట్లో పరిస్థితులు మారిపోతూ వచ్చాయి. భార్య రమ్యా తీరుతో భర్త విసిగిపోయాడు. పెద్దలు రాజీ చేసి రమ్యా, సూరజ్ దంపతులను ఒక్కటి చేశారు. ఆఫీసుకు వెళ్లి వస్తున్న సూరజ్ ను ఇంటి బయట నిలబెట్టిన అతని భార్య రమ్యా అతని దుస్తులతో పాటు బూట్లు విప్పించి బయటే డిటెర్జెంట్ సబ్బు, సర్ఫ్ తో క్లీన్ చెయ్యడం మొదలు పెట్టింది.

సర్ఫ్ నీళ్లతో ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్.....శుభ్రం పేరుతో సినిమా చూపించిన భార్య
సూరజ్, రమ్యా దంపతుల మద్య గొడవలు ఎక్కువ కావడంతో మళ్లీ పెద్దలు జోక్యం చేసుకున్నారు. భార్య రమ్యాతో కళ్లు మూసుకుని కాపురం చేసిన సూరజ్ రెండో బిడ్డకు తండ్రి అయ్యాడు. రెండో బిడ్డ పుట్టిన తరువాత రమ్యా శుభ్రత పైత్యం నసాలానికి ఎక్కింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న భర్త సూరజ్ ల్యాప్ టాప్, అతని మొబైల్ ఫోన్ సర్ఫ్ నీళ్లలో నానబెడుతున్న రమ్యా వాటిని రోజూ శుభ్రం చెయ్యడం మొదలుపెట్టింది. దెబ్బకు సూరజ్ ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు దెబ్బతిన్నాయి.

తల్లి చనిపోయిందని భర్త, బిడ్డలను ఇంటి నుంచి తరిమేసింది
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో రమ్యా శుభ్రత విషయంలో ఇంకా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేసింది. ఇదే సమయంలో రమ్యా తల్లి కరోనా వైరస్ వ్యాధితో చనిపోయింది. తల్లి చనిపోయిన తరువాత భయపడిపోయిన రమ్యా ఆమె భర్త సూరజ్ ను, ఇద్దరు బిడ్డలను నెల రోజుల పాటు ఇంటి నుంచి బయటకు తరిమేసి ఇంటిని ఆమె ఒక్కటే శుభ్రం చెయ్యడం మొదలుపెట్టింది.

విడాకుల కావాలని వెళ్లిన భర్త
భార్య రమ్యా తీరుతో విసిగిపోయిన ఆమె భర్త సూరజ్ 11, 9 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలను పిలుచుకుని ఇంటి నుంచి చాకచక్యంగా బయటకు వచ్చేశాడు. నా భార్య రమ్యా తీరుతో మాకు మెంటల్ వస్తోందని, నన్ను మీరే కాపాండండి దేవుడా, నాకు విడాకులు ఇప్పించండి అంటూ బెంగళూరు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య రమ్యాతో తనకు విడాకులు కావాలని సూరజ్ పట్టుబట్టాడు.

రోజుకు ఐదు సార్లు స్నానం చేస్తోంది
నా భార్య రమ్యా ప్రతిరోజూ ఐదుసార్లు స్నానం చేస్తోందని, నేను, మా పిల్లలు బయటి నుంచి ఇంటికి వెళితే మా దుస్తులు మొత్తం విప్పించి మాతోనే ఉతికించి తరువాత ఇంట్లోకి రావాలని చెబుతోందని సూరజ్ పోలీసుల ముందు వాపోయాడు. విషయం తెలుసుకున్న బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో వాణి సహాయవాణి కేంద్రం (మహిళల హెల్ఫ్ లైన్) సీనియర్ కౌన్సిలర్ సరస్వతి సాఫ్ట్ వేర్ ఇంజనీరు సూరజ్ భార్య రమ్యాను పిలిపించుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు.

భార్యలో మార్పుమాత్రం రాలేదు
ఇప్పటికే సాఫ్ట్ వేర్ ఇంజనీరు సూరజ్ భార్యకు బెంగళూరు పోలీసు అధికారులు అనేకసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. రమ్యా మానసిక్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. అయితే రమ్యా చాలా ఆరోగ్యంగానే ఉందని వైద్యులు అంటున్నారు. పోలీసులు, వైద్యులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా రమ్యా తీరులో ఎలాంటి మార్పు రావడం లేదని, ఆమె భర్త మాత్రం కచ్చితంగా విడాకులు కావాలని అంటున్నాడని బెంగళూరు కమీషనర్ ఆఫీసు కార్యాలయంలోని మహిళా హెల్ఫ్ లైన్ హెడ్ రాణి శెట్టి అంటున్నారని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది. మొత్తం మీద శుభ్రత పేరుతో టెక్కీకి అతని భార్య ప్రతిరోజూ సినిమా చూపిస్తోందని వెలుగు చూడటం ఐటీ హబ్ బెంగళూరు సిటీలో కలకలం రేపింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications