17 ఏళ్ల అబ్బాయితో 25 ఏళ్ల యువతి ప్రేమాయణం.. ఆ తరువాతే మొదలైంది అసలు కథ

ఓ17 ఏళ్ల అబ్బాయి.. పాతికేళ్ల యువతికి నడుమ కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోంది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా కూడా ఒక్కటి కావడంతో ఆ యువతి గర్భం దాల్చింది. సరిగ్గా అప్పుడే మొదలైంది అసలు కథ.

చెన్నై: ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల అబ్బాయి.. విద్యావంతురాలైన పాతికేళ్ల వయసున్న ఓ యువతికి నడుమ కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోంది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా కూడా ఒక్కటి కావడంతో ఆ యువతి గర్భం దాల్చింది.

సరిగ్గా అప్పుడే మొదలైంది అసలు కథ. ఆ యువతి తాను అతడి బిడ్డకు తల్లిని కాబోతున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని అబ్బాయిని కోరగా అతడు తిరస్కరించాడు. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు.

పెళ్లి చేసుకో.. లేదంటే..

పెళ్లి చేసుకో.. లేదంటే..

ఇద్దరూ ఏకాంతంగా, సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన వీడియోను చూపించి, తనను పెళ్లి చేసుకోకపోతే ఆ వీడియోను బయటపెడతానంటూ ఆ యువతి బెదిరించడంతో ఏం చేయాలో అర్థం కాక పురుగుమందు తాగి ఆ అబ్బాయి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

పక్కపక్క ఇళ్లల్లో ఉంటూ...

పక్కపక్క ఇళ్లల్లో ఉంటూ...

ఈ ఘటన తమిళనాడులోని తిలక్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జయనగర్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఆ అబ్బాయి(17), పక్కింటిలోనే ఉంటోన్న ఆ యువతి(25) కి మధ్య నడిచిన ప్రేమాయణం ఆఖరు ఘట్టానికి చేరుకోవడంతో ఇరు వర్గాల పెద్దలు రంగంలోకి దిగారు.

అభ్యంతరకర వీడియో.. బ్లాక్ మెయిలింగ్

అభ్యంతరకర వీడియో.. బ్లాక్ మెయిలింగ్

ఇరు కుటుంబాల వారి మధ్య చర్చలు జరిగాయి. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని యువతి కుటుంబీకులు డిమాండ్‌ చేశారు. దీనికి అతడి కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. దీంతో ఇద్దరూ కలిసి సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన అభ్యంతరకర వీడియో ఒకటి ఆ యువతి వద్ద ఉండటంతో.... దానిని చూపించి ఆ కుర్రాడి తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్‌ చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...

దీంతో బాధిత బాలుడు గురువారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించడంతో అతడిని చికిత్స నిమిత్తం బీజీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై ఆ అబ్బాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

మాట్లాడదామని పిలిచి గొడవ...

మాట్లాడదామని పిలిచి గొడవ...

ముందు రోజు మాట్లాడదాం రమ్మంతూ తమను అమ్మాయి తరపు వారు వారి ఇంటికి పిలిచి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గొడవ పెట్టారని, అమ్మాయి తరపు బంధువులు తమకు మూడు ఆప్షన్లు ఇచ్చారని, ఒకటి - వెంటనే వారిద్దరికీ పెళ్లి చేయడం, రెండు- ఆ అమ్మాయికి పుట్టబోయే బిడ్డ బాధ్యత తీసుకోవడం, మూడు- అబ్బాయికి చట్టపరంగా వివాహం చేసుకునే వయసు వచ్చాక ఆ అమ్మాయినే పెళ్లి చేసుకునేలాగ రాసి ఇవ్వటం.

గతంలోనూ ఇలాగే...

గతంలోనూ ఇలాగే...

ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే.. సదరు యువతి గతంలో అదే కాలనీకి చెందిన, తనకంటే వయసులో చిన్నవారైన ఇద్దరు అబ్బాయిలతో ఇలాగే ప్రేమాయణం సాగించిందంటూ అబ్బాయి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం.

ఇద్దరి మీదా కేసులు...

ఇద్దరి మీదా కేసులు...

ఆ అమ్మాయికి.. ముందు ప్రేమ నటించడం, ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేయడం ఒక అలవాటుగా ఉన్నట్లు కూడా ఆ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు మాత్రం ఇటు అబ్బాయి మీద, అటు అమ్మాయితోపాటు ఆమె ఇద్దరు బావల మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+