సంచలనం: బాలుడి తల నరికి.. ఠాణాలోకి విసిరేసిన దుండగులు!
తమిళనాడులోని కడలూరులో బుధవారం రాత్రి ఇద్దరు దుండగులు ఒక బాలుడి తల నరికి దానిని ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోకే విసిరేశారు.తమిళనాడులోని కడలూరులో బుధవారం రాత్రి ఇద్దరు దుండగులు ఒక బాలుడి తల నరికి
కడలూర్: ఇద్దరు దుండగులు ఒక బాలుడి తల నరికి దానిని ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోకే విసిరేసిన ఘటన సంచలనం సృష్టించింది. తమిళనాడులోని కడలూరులో బుధవారం రాత్రి ఈ దారుణం జరిగింది.
బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పోలీస్‌స్టేషన్ గేటు ఎదుట వాహనం నిలిపి స్టేషన్ లోపలికి బాలుని తలను విసిరేసినట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నది. పుదుచ్చేరిలో ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో ఈ బాలుడి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీస్‌స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో మృతుడు స్వేతన్ (17) మొండాన్ని గుర్తించారు. దానిని పోస్టుమార్టం నిమిత్తం పుదుచ్చేరి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications