కదులుతున్న రైలులో టీనేజ్ అమ్మాయిపై..!!
కేరళలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశాడు. ఓ టీనేజ్ అమ్మాయిపై ఆకృత్యానికి పాల్పడ్డాడు. కదులుతున్న రైలు నుంచి ఆమెను బయటికి తోసేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తిరువనంతపురం వెల్లరాడ ప్రాంతానికి సురేష్ కుమార్ గా గుర్తించారు.
నంబర్ 12626 న్యూఢిల్లీ- త్రివేండ్రం సెంట్రల్ మధ్య రాకపోకలు సాగించే కేరళ ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన సంభవించింది. బాధితురాలి స్వస్థలం తిరువనంతపురం పాలూడ్. ఈ ఎక్స్ ప్రెస్ ఆదివారం రాత్రి వర్కల స్టేషన్ దాటుకున్న కొద్దిసేపటికే సురేష్ కుమార్.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వర్కల- కడక్కావూర్ స్టేషన్ల మధ్య కదులుతున్న రైలు నుంచి ఆమెను కిందికి తోసివేశాడు. వర్కల స్టేషన్ నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న అయంతి వద్ద రాత్రి 8:15 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు.

సురేష్ కుమార్ ఆ యువతిని కిందికి తోసివేసిన విషయాన్ని తోటి ప్రయాణికులు వర్కల స్టేషన్ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయంతి సమీపంలో బ్రిడ్జి వద్ద ట్రాక్ పక్కన పడివున్న స్పృహ తప్పిన స్థితిలో కనిపించారు. అదే సమయంలో తిరువనంతపురం వైపు వస్తున్న MEMUను అధికారులు ఆపేశారు. లేకుంటే ఆ యువతిని మెమె ఢీ కొట్టి ఉండేదని తెలిపారు.
గాయపడిన యువతిని రక్షించి, వర్కల రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో ఆమెను శ్రీ నారాయణ మిషన్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం, అంతర్గత గాయాలు అయ్యాయని డాక్టర్లు వెల్లడించారు. తల, పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో రైల్వే పోలీసులు ఆమె వెంట ఉన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications