టిక్‌టాక్ వీడియో కోసం దాష్టీకం: బాలుడిని నగ్నంగా నడిపించిన వైనం: ఇద్దరి అరెస్టు

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్‌టాక్ వీడియో కోసం కొందరు యువకులు 14 సంవత్సరాల బాలుడిని నగ్నంగా నడిపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమెను తిడుతూ..బెల్టుతో కొడుతూ ఈ వీడియోను చిత్రీకరించారు. అనంతరం వారు ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. పోలీసుల కంట్లో పడింది. ఈ ఉదంతాన్ని సుమోటోగా తీసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.

ఈ ఘాతుకానికి ప్రధాన కారణం.. ఆ బాలుడు ఓ మైనర్ బాలికతో టిక్‌టాక్ వీడియోను చిత్రీకరించడానికి ప్రయత్నించడమే. ఈ విషయం తెలుసుకున్న ఆ మైనర్ బాలిక తండ్రి, సోదరుడు అమానుషంగా ప్రవర్తించారు. తన కుమార్తెతో టిక్‌టాక్ వీడియోను తీయడానికి ప్రయత్నించిన ఆ బాలుడిని పట్టుకుని చితక్కొట్టాడు. అతని బట్టలు విప్పించి.. నగ్నంగా వీధుల్లో తిప్పాడు. ఈ సందర్భంగా అతను ఆ బాలుడిని బూతులు తిట్టడం, బెల్టుతో కొట్టడం ఈ వీడియోలో కనిపించింది.

అతని స్నేహితులు తమ మొబైల్ ఫోన్ ద్వారా ఈ ఘాతుకాన్ని తెరకెక్కించారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. జైపూర్ నగర పోలీస్ కమిషనర్ ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఉత్తర్వులను జారీ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురిలో ఇద్దర్ని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశామని జైపూర్ అదనపు పోలీస్ డిప్యూటీ కమిషనర్ మనోజ్ చౌదరి తెలిపారు.

teen paraded naked, abused for shooting Tik Tok video in Rajasthan

మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని అన్నారు. పరారీలో ఉన్న నిందితుల సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా వారి గురించి అన్వేషిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సుమోటోగా ఈ కేసును స్వీకరించినట్లు వెల్లడించారు. అలాగే మైనర్ బాలికతో టిక్‌టాక్ వీడియోను తీయడానికి ప్రయత్నించిన బాలుడిపైనా కేసు పెట్టామని మనోజ్ చౌదరి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+