16 ఏళ్ల అమ్మాయిపై 16 నెలలుగా అత్యాచారం.. ఆరుగురి అరెస్ట్

ఇండోర్ : మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. 16ఏళ్ల యువతిపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. 16నెలలుగా ఈ ఆకృత్యాన్ని కొనసాగిస్తున్నారు. యువతిపై దారుణానికి ఒడిగట్టిన వారిలో 50ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసు మృగాళ్లు ఉన్నారు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితుల్ని కటకటాల వెనక్కి నెట్టారు.

పోర్న్ వీడియోలు చూపించి అత్యాచారం

పోర్న్ వీడియోలు చూపించి అత్యాచారం

ఇండోర్‌కు చెందిన బాధితురాలు 2018 మార్చిలో ఇంటర్ చదువుతున్న యువతి తల్లి చనిపోవడంతో చదువు మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. తన చెల్లెలు, తండ్రితో కలిసి నివసిస్తున్న ఆమెపై పక్కింటి వ్యక్తి కన్నేశాడు. క్యాటరింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేసే సదరు వ్యక్తి తన పిల్లల అవసరాలు చూసుకుంటే డబ్బు ఇస్తానని చెప్పడంతో యువతి అంగీకరించింది. ఇదే అదనుగా సదరు యువతికి పోర్న్ వీడియోలు చూపిన నిందితుడు అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

తండ్రీ కొడుకుల పైశాచికం

తండ్రీ కొడుకుల పైశాచికం

యువతిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలుసుకున్న లా స్టూడెంట్ అయిన అతని కొడుకు యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చకపోతే విషయం అందరికీ చెప్పేస్తానని భయపెట్టి యువతిపై అత్యాచారానికి తెగబడ్డారు. అప్పటి నుంచి తండ్రీ కొడుకులు అవకాశం దొరికినప్పుడల్లా యువతితో లైంగిక వాంఛలు తీర్చుకోవడం మొదలుపెట్టారు.

బెదిరించి అత్యాచారం చేసిన మరో నలుగురు

బెదిరించి అత్యాచారం చేసిన మరో నలుగురు

కొన్నాళ్లకు సదరు యువతి తన స్కూల్ ఫ్రెండ్ అయిన అబ్బాయికి విషయం చెప్పి సాయం కోరింది. నిందితుడికి బంధువైన సదరు యువకుడు సైతం సాయం చేయకపోగా విషయం ఆమె తండ్రికి చెబుతానని బెదిరించి అమ్మాయిపై అఘాయిత్యం చేశాడు. ఆ విషయం తెలుసుకున్న అతని సోదరుడు సైతం యువతిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు సదరు యువతి ఇంటి పక్కనే ఉండే ఇద్దరు యువకులకు విషయం తెలియడంతో వారు సైతం ఆ అమ్మాయిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసుుల

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసుుల

16 నెలలుగా ఆరుగురు నిందితుల వేధింపులను ఎదుర్కొన్న బాధితురాలు చివరకు తండ్రికి విషయం చెప్పింది. అతని సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి కంప్లైంట్ ఆధారంగా క్యాటరింగ్ కాంట్రాక్టర్, అతని కొడుకు, వారి బంధువులైన 16, 18 ఏళ్ల యువకులతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+