'సెక్స్' కోసం వేధించిన యజమానురాలు: భరించలేక హత్య చేసిన బాలుడు..
ఇంటి యజమాని అనిత చాలాకాలంగా తనను శృంగారం కోసం వేధిస్తోందని అందువల్లే హత్య చేయాల్సి వచ్చిందని బాలుడు పేర్కొనడం గమనార్హం.
ఢిల్లీ: 16ఏళ్ల మైనర్ బాలుడు తన ఇంటి యజమానిని హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని లజపత్ నగర్‌లో చోటు చేసుకుంది. హత్యానంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అతను నేరం అంగీకరించాడు.
ఇంటి యజమాని అనిత చాలాకాలంగా తనను శృంగారం కోసం వేధిస్తోందని అందువల్లే హత్య చేయాల్సి వచ్చిందని బాలుడు పేర్కొనడం గమనార్హం. ఆదివారం రాత్రి ఈ హత్య జరగ్గా.. ఆ సమయంలో ఆమె భర్త ఆఫీసులో ఉన్నట్లు చెబుతున్నారు.

హత్య చేసినందుకు తాను పశ్చాత్తపంతో కుమిలిపోతున్నానని బాలుడు ఏడుస్తూ పోలీసులతో చెప్పాడు. అందుకే నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు తెలిపాడు.
కాగా, ఎన్నిసార్లు తిరస్కరించినా.. బాలుడిని యజమానురాలు శృంగారం కోసం ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఆమె టీవీ చూస్తున్న సమయంలో.. బాలుడు ఆమె వద్దకు వెళ్లి కత్తితో గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.












Click it and Unblock the Notifications