Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెయ్యి తెగిపోయినా నడిరోడ్డులో సినిమా చూపించిన కుసుమ కుమారి, చీపురు చిక్కలేదు, వీడియో వైరల్!

చండీగఢ్/ జలందర్/ పంజాబ్: ట్యూషన్ నుంచి ఇంటికి వెలుతున్న యువతి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ఇద్దరు దుండగులు విఫలయత్నం చేశారు. అంత వరకు కామ్ గా నడిచి వెలుతున్న యువతికి మండిపోయి దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే అదే సమయంలో ఓ దొంగ కత్తి తీసుకుని యువతి చెయ్యి కోసేశాడు. చెయ్యి తెగిపోయినా యువతి మాత్రం ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించింది. పేరు కుసుమ కుమారి అయినా ఆమె ధైర్యం మాత్రం ఝాన్సీరాణికి ఉన్నట్లు ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

ట్యూషన్ కు వెళ్లిన యువతి

ట్యూషన్ కు వెళ్లిన యువతి

పంజాబ్ లోని జలంధర్ లో నివాసం ఉంటున్న కుసుమ కుమారి అనే యువతి లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నది. అయితే ఆన్ లైన్ తరగతులకు హాజరౌతున్న కుసుమ కుమారి కొన్ని రోజుల నుంచి ప్రతిరోజు ఇంటి సమీపంలో ట్యూషన్ కు వెళ్లి వస్తోంది. ఎప్పటిలాగే ట్యూషన్ కు వెళ్లిన కుసుమ కుమారి తరువాత ఇంటికి బయలుదేరింది.

విలువైన మొబైల్, బంగారు చైన్

విలువైన మొబైల్, బంగారు చైన్

కుసుమ కుమారి మెడలో విలువైన బంగారు గొలుసు ఉంది. అంతే కాకుండా కుసుమ కుమారి ఖరీదైన మొబైల్ ఉపయోగిస్తోంది. ప్రతిరోజు ట్యూషన్ కు వెళ్లివస్తున్న కుసుమ కుమారి మొబైల్ ఫోన్, బంగారు గొలుసు లూటీ చెయ్యాలని దుండగులు ప్లాన్ వేశారు. కుసుమ కుమారి ఎప్పుడెప్పుడు ట్యూషన్ కు వెళ్లి వస్తోందని దుండగులు పూర్తి సమాచారం సేకరించారు.

కుమారికి పూనకం వచ్చేసింది

కుమారికి పూనకం వచ్చేసింది

ట్యూషన్ పూర్తికావడంతో కుసుమ కుమారి ఇంటికి నడుచుకుంటూ వెలుతోంది. అదే సమయంలో ఇద్దరు దుండగులు బైక్ లో వెనుక నుంచి కుసుమ కుమారిని ఫాలో అయ్యారు. కుసుమ కుమారి నిర్జనప్రదేశంలో వెలుతున్న సమయంలో బైక్ లో వెళ్లిన దుండగులు కుసుమ కుమారి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాక్కొవడానికి విఫలయత్నం చేశారు. ఆ సమయంలో పూనకం వచ్చిన కుసుమ కుమారి బైక్ లో వెనుక కుర్చున్న వ్యక్తిని ఒక్కసారిగా బలంగా వెనక్కి లాగడంతో అతను కింద రోడ్డు మీదకు కుప్పకూలిపోయాడు.

కత్తితో చెయ్యి కోసేసినా వదల్లేదు

కత్తితో చెయ్యి కోసేసినా వదల్లేదు

బైక్ మీద నుంచి కిందపడిపోయిన దుండగుడు జోబులో ఉన్న కత్తితీసుకుని కుసుమ కుమారి చేతిని కోసేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే చెయ్యి తెగిపోయినా కుసుమ కుమారి మాత్రం అతన్ని వదిలిపెట్టకుండా గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.

Recommended Video

    MS Dhoni’s Six Cancelled A Pak Cricketer’s 'Date' With An Indian Girl || Oneindia Telugu
    చేతికి చీపురు చిక్కలేదు కాని !

    చేతికి చీపురు చిక్కలేదు కాని !

    కిందపడిన దొంగను కుసుమ కుమారి పట్టుకుని చితకబాదేసింది. ఆవేశంలో ఉన్న కుసుమ కుమారి చేతికి చీపురు చిక్కకపోవడంతో దొంగ బతికిపోయాడు. అదే సమయంలో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగకు దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుసుమ కుమారి చేతిలో మొబైల్ లూటీ చెయ్యడానికి ప్రయత్నించి చిక్కిపోయిన యువకుడి పేరు అవినాష్ కుమార్ అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

    కుసుమ కుమారి ప్రాణాలకు తెగించి దొంగలతో పోరాటం చేస్తున్న సమయంలో అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ సీసీకెమెరాల క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చేతికి తీవ్రగాయాలైన కుసుమ కుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. కుసుమ కుమారిని ఆసుపత్రికి తరలించి బైక్ లో పరారైన మరో దుండగుడి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+