దారుణం: ఏడాదిగా కన్న కూతురుపై తండ్రి అత్యాచారం

బలరాంపూర్: కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తండ్రి.. కామంతో కళ్లుమూసుకుపోయి కన్న కూతురు(16)పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అఘాయిత్యాన్ని ఏడాదిపాటు కొనసాగించాడా దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. డ్రైవర్‌గా పనిచేస్తున్న తన తండ్రి ప్రమోద్ కుమార్ చేస్తున్న అఘాయిత్యం గురించి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇంట్లో ఒంటరిగా కనపడినప్పుడల్లా అతడు అత్యాచారం చేసేవాడని పోలీసులు తెలిపారు.

Teenage girl raped by her father for over an year in Rajasthan

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని తన తండ్రి బెదిరించినట్లు 10వ తరగతి చదువుతూ మధ్యలో ఆపేసిన ఆ అమ్మాయి చెప్పింది. ఇదే విషయాన్ని తన అమ్మకు, అన్నకు చెప్పినా.. వాళ్లు కూడా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారని తెలిపింది.

ఆమెను వైద్యపరీక్షలకు పంపి, నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మేజిస్ట్రేట్ వద్ద ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇంత నేరం జరుగుతున్నా అడ్డుచెప్పనందుకు బాధితురాలి అమ్మ, అన్నలపై కూడా సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+