కోడలిపై నాలుగు రోజుల్లో మూడు సార్లు రేప్: మామపై ఫిర్యాదు

ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో దారుణం ఘటన చోటు చేసుకుంది. 15ఏళ్ల యువతిపై ఆమె మామ నాలుగు రోజుల్లో మూడు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను హెచ్చరించాడు. కాగా, విషయాన్ని గమనించిన నిందితుడి భార్య పోలీసులను ఆశ్రయించింది.

బంగంగా పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు కమలేష్ అతని కోడలుపై నాలుగు రోజుల్లో మూడు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజాభాగ్ ప్రాంతంలోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Teenager raped by uncle thrice in 4 days in Indore, accused on run

సోమవారం రాత్రి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, బాధితురాలి అరుపులు విన్న నిందితుడి భార్య అక్కడకి చేరుకుని అతడ్ని అడ్డుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కమలేష్.. తన భార్యను, బాధితురాలిని చితకబాదాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే అందర్నీ చంపేస్తానని హెచ్చరించాడు.

ఆ తర్వాత నిందితుడు కమలేష్ అక్కడ్నుంచి పరారయ్యాడు. కాగా, మంగళవారం సాయంత్రం నిందితుడి భార్య ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడు కమలేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుడి భార్య అస్వస్థతకు గురికావడంతో ఆమెకు సేవలు చేసేందుకు బాధితురాలిని ఆమె తల్లిదండ్రులు నిందితుడి ఇంటికి పంపించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+