ఆన్‌లైన్‌లో ఫొటో, ఫోన్‌నెంబర్: మహిళకు వేధింపులు

సూరత్: ఓ వివాహిత ఫొటోను, ఆమె ఫోన్ నెంబర్‌ను సోషల్ నెట్‌వర్క్ సైట్లలో అప్‌లోడ్ చేసి ఆమెను ఓ వేశ్యగా చిత్రీకరిస్తూ వేధింపులకు గురి చేస్తున్న యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాక నిందితుడు ఆమెకు అసభ్య సందేశాలు పంపిస్తూ.. ఆమె నుంచి రూ. 2వేలు డిమాండ్ చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందిత యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. భావ్‌నగర్ జిల్లాలోని గాధ్డ పట్టణానికి చెందిన 17ఏళ్ల నిందితుడు మంగళవారం రాత్రి సూరత్ నగరానికి చెందిన ఓ డాక్టర్ భార్యకు అసభ్య సందేశాలు పంపాడు. అంతేగాక ఆమెకు సంబంధించిన ఫొటోలను, ఫోన్ నెంబర్‌ను సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. రూ. 2వేలు డిమాండ్ చేస్తూ వాట్సప్ ద్వారా బెదిరింపు సందేశాలను ఆమెకు పంపించాడు.

Teenager uploads mobile number, photos of woman on net, demands Rs 2,000

లేదంటే ఆ మహిళను వేశ్యగా చిత్రీకరిస్తూ ఆమె ఫొటోను, ఫోన్ నెంబర్‌ను ఇంటర్నెట్, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. అంతేగాక తనతో శరీరక సంబంధాన్ని పెట్టుకోవాలని తన సందేశాలతో ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఇందుకు నిరాకరించడంతో ఆమెకు సంబంధించిన ఫొటోలను, పోన్ నెంబర్‌ను సోషల్ సైట్లలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఆమెకు అనేకమంది నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి.

ఈ వేధింపులతో ఆమె తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. సోమవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడి మొబైల్ నెంబర్ ద్వారా అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫొటోలు, ఫోన్ నెంబర్ అతనికి ఎలా లభ్యమయ్యాయనే దానిపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+