టిక్‌టాక్ పిచ్చి : బ్రిడ్జిపైకి ఎక్కి.. నదిలోకి దూకి..
గోరఖ్‌పూర్ : షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ పిచ్చి రోజు రోజుకూ ముదురుతోంది. తమిళనాడులో డేంజరస్ స్టంట్ చేస్తూ మెడ విరగ్గొట్టుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మరువకముందే యూపీలో ఇద్దరు టీనేజర్లు ఇలాంటి సాహసానికి ఒడిగట్టారు. టిక్‌టాక్ వీడియో చేస్తూ నదిలోకి దూకి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. స్థానికుల సాయంతో మరొకరు బతికి బట్టకట్టాడు.

బ్రిడ్జిపై డేంజరస్ స్టంట్లు
ఔరంగాబాద్‌కు చెందిన దానిష్ యూపీ దేవ్‌గఢ్ జిల్లాలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడ ఆటో డ్రైవర్ అయిన ఆషిక్‌తో అతనికి స్నేహం ఏర్పడింది. తరచూ టిక్‌టాక్ వీడియోలు పోస్ట్ చేసే ఈ ఇద్దరు యువకులు సోమవారం సాయంత్రం చోటీ గండక్ నది వద్దకు వెళ్లారు. నదావర్ ఓవర్ బ్రిడ్జిపైకి చేరుకున్న దానిష్, ఆషిక్‌లు అప్పటికే అక్కడ స్టంట్లు చేస్తూ వీడియోలు చేస్తున్న కొందరు యువకులను పరిచయం అయ్యారు. వారితో కలిసి ఆ ఇద్దరూ కొన్ని టిక్ టాక్ వీడియోలు చేశారు.

బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి
కాసేపు సరదాగా గడిపిన దానిష్, ఆషిక్‌లు ఓ డేంజరస్ స్టంట్ చేసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేసి ఫేమస్ అవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా దానిష్ బ్రిడ్జి రెయిలింగ్ ఎక్కి ఒక్కసారిగా నదిలోకి దూకాడు. ఈ తంతంగాన్ని అంతవరకు వీడియో తీసిన ఆషిక్ కూడా ఆ వెంటనే బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకేశాడు. అయితే నదీ ప్రవాహం వేగానికి వారిద్దరు కొట్టుకుపోయారు. విషయం గ్రహించిన స్థానికులు వెంటనే దానిష్‌ను కాపాడారు. ప్రవాహ వేగానికి ఆషిక్ గల్లంతయ్యాడు.

ఇంకా దొరకని ఆషిక్ ఆచూకీ
ఇద్దరు యువకులు నదిలో కొట్టుకుపోతున్న విషయం తెలిసి పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి టిక్ టాక్ కోసం వీడియోలు చేస్తూ ఈ సాహసానికి పాల్పడ్డారని తెలుసుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గల్లంతైన ఆషిక్ ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications