తెహెల్కా ట్విస్ట్: తనవల్ల కాదని మహిళా జర్నలిస్ట్ రిజైన్

న్యూఢిల్లీ: తెహెల్కా తరుణ్ తేజ్‌పాల్ లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్. లైంగిక వేధింపులకు గురైన మహిళా విలేకరి సోమవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన పట్ల సంస్థ వైఖరి తీరుకు ఆమె రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ పని చేయడం తన వల్ల కాదని రాజీనామాలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. కేసు విచారణకు సహకరించేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు భావిస్తున్నారు. మరోవైపు గోవాలో కేసు పెట్టినందున గోవాలో న్యాయసహాయం పొందే వరకు తనకు మధ్యంతర రక్షణ కల్పించాలని బాధితురాలు కోరుతున్నారు.

ఇటీవల గోవాలని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తెహెల్కా మేనేజింగ్ వ్యవస్థాపకులు తేజ్‌పాల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సదరు విలేకరి ఆరోపించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

ABVP Activists

లైంగిక ఆరోపణలు రావడంతో తరుణ్ తేజ్‌పాల్ ఇటీవల తెహెల్కా నుండి ఆరు నెలల పాటు తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ సోమ చౌదరికి తరుణ్ తేజ్‌పాల్ ఓ లేఖ రాశారు.

'తప్పుడు నిర్ణయం, పరిస్థితి సరిగా అంచనా వేయకపోవడం వల్ల దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మహిళా విలేకరి పట్ల తన అమర్యాదక పూర్వక ప్రవర్తనకు ఇప్పటికే ఆమెకు బేషరతుగా క్షమాపణలు చెప్పాను. ఈ ప్రాయశ్చితం సరిపోదని భావించి తాను ఎడిటర్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాను. మాటలతో ప్రాయశ్చితం సరిపోదని భావిస్తున్నాను. ఈ కారణంగానే తాను తెహెల్కా ఎడిటర్ స్థానం నుండి, తెహెల్కా కార్యాలయం నుండి ఆరు నెలలు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నాను' అని పేర్కొన్నారు.

అయితే, తేజ్‌పాల్ లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అతనిని అరెస్టు చేయాలని మహిళా సంఘాలు, ఇతరులు ఒత్తిడి తెచ్చారు. పోలీసులు కూడా అరెస్టు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇది మంగళవారం విచారణకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+