లైంగిక వేధింపులు: తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్
న్యూఢిల్లీ: అరెస్టును తప్పించుకోవడానికి తరుణ్ తేజ్‌పాల్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు అర్థమవుతోంది. తెహెల్కా ఎడిటర్ - ఇన్ - చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ తన సహోద్యోగినిపై లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్‌ను కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
తరుణ్ తేజ్‌పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి గోవా పోలీసులు ముంబైకి చేరుకునే అవకాశం ఉంది. బాధితురాలు చెప్పిన సంఘటనలను ముగ్గురు సహోద్యోగులు నిర్ధారించారు. ఈ ముగ్గురిని కూడా పోలీసులు ఆదివారంనాడు ప్రశ్నించారు.

తేజ్‌పాల్ విషయంలో ఏం జరిగిందనే విషయాన్ని బాధితురాలు ముగ్గురు తోటి ఉద్యోగులకు వివరించినట్లు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరికి రాసిన లేఖలో వివరించారు. చౌదరిని పోలీసులు శనివారం తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు. ఆదివారంనాడు కూడా విచారించారు.
తేజ్‌పాల్‌పై గోవా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి తోటి ఉద్యోగులు షౌగత్ దాస్‌గుప్తా, జి. విష్ణు, ఇషాన్ తంకాలను పోలీసులు విచారించారు. పోలీసులు చౌధరి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సిపియు), ల్యాప్‌టాప్, ఐపాడ్‌లను, తేజ్‌పాల్ సిపియుని స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications