యూపీ : తహసీల్దార్ పాడుప‌ని.. మహిళా మేజిస్ట్రేట్​పై అత్యాచార‌య‌త్నం

స‌మాజంలో ఎక్క‌డ చూసినా నిత్యం మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ప‌సిపాపల నుంచి పండుముదుస‌లి వ‌ర‌కూ అత్యాచారాల‌కు గురువుతున్నారు. ఉన్న‌త స్థానాల్లో ఉన్న మహిళ‌ల నుంచి అట్ట‌డుగు వ‌ర్గాల్లో ఉన్న మ‌హిళ‌ల వ‌ర‌కూ అందరిపై ఇలాంటి ఘోరాలు జ‌ర‌గ‌డం నిత్యం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌డు తాజాగా ఓ మ‌హిళ అధికారిపై ఓ త‌హ‌సీల్దార్‌ అత్యాచారయ‌త్నానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వెలుగులోకి వ‌చ్చింది.

ఓ మహిళా మేజిస్ట్రేట్​పై ఉన్నతాధికారి అత్యాచారయత్నానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌స్తీ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఓ బీజేపీ నేత త‌న ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేయడంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది. స్థానిక‌ మహిళా మేజిస్ట్రేట్​పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు నాయబ్ తహసీల్దార్​. అయితే, ఈ విషయాన్ని ఓ బిజెపి నాయకుడు సోష‌ల్‌మీడియాలోని త‌న‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్​ను ఆయన యూపీ గ‌వ‌ర్న‌మెంట్‌తో పాటు ఆ రాష్ట్ర డీజీపీకి కూడా ట్యాగ్​ చేయడంతో విష‌యం వెలుగుచూసింది.

Tehsildar Attempt to sexually assault a woman official

మ‌హిళ అధికారిపై హ‌త్యాయ‌త్నం : బ‌స్తీ జిల్లాలో నాయబ్​ తహసీల్దార్​గా పని చేస్తున్నాడు ఓ వ్య‌క్తి. అయితే, ఆయ‌న దీపావ‌ళి పండుగ రోజు అర్థ‌రాత్రి ఓ మ‌హిళ అధికారి ఇంటికి వెళ్లి త‌లుపులు కొట్టాడు. ఆ మ‌హిళ తలుపులు తీయ‌క‌పోవ‌డంతో వాటిని ప‌గుల‌గొట్టి లోప‌లికి ప్ర‌వేశించాడు. ఆ త‌ర్వాత అక్క‌డ ఉన్న మ‌హిళ అధికారిపై అత్యాచార‌య‌త్నానికి పాల్ప‌డ్డాడు. అయితే, ఆ మ‌హిళ త‌హ‌సీల్దార్ బారి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసింది. దీంతో అధికారి ఆమెను చంపేందుకు ప్ర‌య‌త్నించాడు. త‌న చేతుల‌తో ఆ మ‌హిళ గొంతు నులిమాడు.

దాంతో ఆ మ‌హిళ ప‌డిపోయింది. ఆమె చ‌నిపోయింద‌నుకున్న అధికారి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించాడు. ఇంత‌లో ఆ మ‌హిళ ఒక్క‌సారిగా లేచి దాక్కుందామ‌ని ప్ర‌య‌త్నించింది. అది గ‌మ‌నించిన అధికారి మ‌ళ్లీ ఆమెను చంపేందుకు సిద్ధ‌ప‌డ్డాడు. అత‌ని బారి నుండి త‌ప్పించుకునేందుకు ఆమె విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. ఆ ప్ర‌య‌త్నంలో అధికారిని గ‌దిలోకి తోసేసి బ‌య‌ట గ‌డియ పెట్టి అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌ర్వాత నేరుగా పోలీస్‌స్టేష‌న్ వెళ్లి అధికారిపై ఫిర్యాదు చేసింది.

అయితే ఆ మ‌హిళ అధికారి ఆరోప‌ణ‌ల‌ను పోలీసులు ముందు ప‌ట్టించుకోలేదు. ఈ విష‌యం బీజేపీ ఎమ్మెల్సీ దేవేంద్ర ప్రతాప్​ సింగ్‌కు తెలియ‌డంతో ఆయ‌న రంగంలోకి దిగారు. ఈ సంఘ‌ట‌న గురించి ఆయ‌న త‌న ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఆ పోస్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డిజిపికి ట్యాగ్​ చేయడంతో ఈ సంఘ‌ట‌న గురించి అంద‌రికి తెలిసింది. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అనంతరం మహిళా అధికారి ఫిర్యాదు మేరకు నాయబ్ తహసీల్దార్‌పై కేసు న‌మోదు చేయ‌డం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+