ఘనంగా పెళ్లి! కన్నీటితో పుట్టింటికి ఐశ్వర్య: తేజ్ ప్రతాప్ డ్రగ్స్ బానిస, వింత ప్రవర్తన, విడాకులు!
పాట్నా: వారిద్దరి వివాహం కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. కొంత కాలానికే వారిద్దరి మధ్య బేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. దీంతో కలిసి ఉండటం ఇష్టం లేక విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. విడాకుల కేసు కోర్టులో ఉండగానే ఆమె అత్తారింటిని వీడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదంతా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య గురించి.

కన్నీటితో పుట్టింటికి..
వివరాల్లోకి వెళితే.. విడాకుల కేసుకు సంబంధించి కోర్టుకు బదులిచ్చిన నెల రోజులు ముగిసిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు, తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యా రాయ్ కన్నీటితో అత్తారింటిని పుట్టింటికి వెళ్లిపోయారు. తండ్రి చంద్రికారాయ్ వాహనంలో ఆమె అత్త రబ్రీదేవి ఇంటి నుంచి పయనమయ్యారు.

ఘనంగా వివాహం..
గత సంవత్సరం మేలో ఎంతో ఆర్భాటంగా ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ వివాహం జరిగింది. అయితే, కొద్ది నెలలకే వీరిద్దరి మధ్య కలతలు చోటు చేసుకున్నాయి. తన భర్త తేజ్ ప్రతాప్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఐశ్వర్య గత కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. గృహ హింస నుంచి తనను కాపాడాలని ఆమె ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు కూడా.
Recommended Video

డ్రగ్స్‌కు బానిసయ్యాడు.. అంతేగాక..
తేజ్ ప్రతాప్ డ్రగ్స్‌కు బానిస అయ్యాడనే విషయం తనకు పెళ్లి అయిన కొద్ది రోజులకే తెలిసిందని ఐశ్వర్య తెలిపారు. తన అత్తమామలకు ఈ విషయం తెలిపినా వారు పట్టించుకోవడం లేదని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అంతేగాక, డ్రగ్స్ తీసుకున్న తర్వాత తేజ్ ప్రతాప్.. శ్రీకృష్ణుడిగా, రాధగా దుస్తులు ధరించేవాడని ఐశ్వర్య తెలిపింది.

విసిగిపోయా..
దేవీదేవతలుగా దుస్తులు ధరిస్తాడని తనకు పెళ్లైన కొద్ది రోజులకు తెలిసిందని చెప్పింది. డ్రగ్స్ మత్తులో అతడు ఓసారి గగ్రా, ఛోలీ ధరించి.. మేకప్ వేసుకుని, విగ్గు పెట్టుకుని రాధగా తయారయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతని వింత ప్రవర్తనతో విసిగిపోయి విడాకాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు వాపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా అత్త రబ్రీ దేవి ఇంటి కన్నీళ్లు పెట్టుకుంటూ ఐశ్వర్య తన తండ్రితో పుట్టింటికి వెళ్లిపోయింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications